• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » GANDEEVADHARI ARJUNA REVIEW : “గాండీవధారి అర్జున” తో వరుణ్ తేజ్ మరొక హిట్ అందుకున్నాడా..?

GANDEEVADHARI ARJUNA REVIEW : “గాండీవధారి అర్జున” తో వరుణ్ తేజ్ మరొక హిట్ అందుకున్నాడా..?

Published on August 25, 2023 by Mounika

Advertisement

GANDEEVADHARI ARJUNA REVIEW : మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వరుణ్ తేజ్ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ సినీ అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వరుణ్ నటించే ప్రతి చిత్రం వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ స్టోరీ ఉన్న సినిమాలని చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఈ ఆగస్టు 25న గాండీవధారి అర్జున చిత్రంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేసాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Advertisement

 

సినిమా : గాండీవధారి అర్జున

నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, వినయ్ రాయ్, విమలా రామన్, నరైన్.

దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

సంగీతం : మిక్కీ జె మేయర్

నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్

విడుదల తేదీ : ఆగస్ట్ 25, 2023

ఇంతకీ కథ ఏమిటంటే ..

 

లండన్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావడానికి భారత కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బహదూర్ (నాజర్) వెళ్ళటానికి సిద్ధమవుతారు. ఆయనను కలవాలని, ఓ పెన్ డ్రైవ్ (ఫైల్ 13 – వీడియో) అందించడానికి శృతి (రోషిణి ప్రకాష్) చాలా ప్రయత్నిస్తుంది. ఆమెను కలిసినప్పుడు ఆదిత్య రాజ్ పైనా ఎటాక్ జరుగుతుంది. ఆదిత్య రాజ్ ని కాపాడేందుకు ఆయనకు సెక్యూరిటీగా అర్జున్ వర్మ (వరుణ్ తేజ్)ను నియమిస్తారు. ఆదిత్య రాజ్ పర్సనల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి అయినా ఐరా (సాక్షి వైద్య), అర్జున్ వర్మ ఒకప్పటి ప్రేమికులు. ఐరా, అర్జున్ మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటి..? అసలు… ఆదిత్య రాజ్ బహదూర్ మీద ఎటాక్ ఎందుకు జరుగుతుంది..? అటాక్ చేసిన వారు ఎవరు..? ఆదిత్య రాజ్, ఆయన ఫ్యామిలీని అర్జున్ వర్మ ఎలా కాపాడాడు..? ఇంతకి రణ్‌వీర్ (వినయ్ రాయ్) ఎవరు..? అసలు ఆ ఫైల్ 13లో ఏముంది..? చివరకు ఏమైంది..? అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్లలో సినిమా చూడాల్సిందే.

సమీక్ష:

Advertisement

‘గాండీవధారి అర్జున’ పేరులో తెలుగుదనం ఉంది, కానీ కథ జరిగే ప్రాంతాల్లో తెలుగుదనం అసలు కనపడలేదు. ఎక్కువ శాతం కథ లండన్, డెహ్రాడూన్, ఢిల్లీ ప్రాంతాల్లో తీయడం జరిగింది. కొన్ని సన్నివేశాలు లంబసింగిలో జరిగినట్టు చూపించారు. గాండీవధారి అర్జున కోసం ప్రవీణ్ సత్తారు రాసిన కథలో, సినిమా నేపథ్యంలో పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు కావలసిన హంగులు చాలా ఉన్నాయి. అయితే… సినిమా కథాంశంలో  ప్రేక్షకులు లీనమయ్యే అంత సినిమా లేదు. కథలో కీలకమైన మెడికల్ వేస్టేజి పాయింట్ కూడా ఇంతకు ముందు వచ్చిన సింగం 3 సినిమాలో చూసిన రొటీన్ భావన కలుగుతుంది. యాక్షన్ సినిమాలకు నేపథ్య సంగీతం  చాలా ముఖ్యం. నేపథ్య  సంగీతం హీరోయిజాన్ని ఎలివేట్ చేసేవిధంగా  లేదు. ఇక సినిమాటోగ్రఫీ బావుంది. స్క్రీన్ మీద వరుణ్ తేజ్ యాక్షన్ కి విజువల్స్ బావున్నాయి. ఈ కథను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రేంజ్ లో ప్రవీణ్ సత్తారు రాశారు. నిజానికి డిస్కస్ చేయాల్సిన కార్బన్ ఫుట్ ప్రింట్ సమాజానికి పట్టిన క్యాన్సర్ లాంటిది అనే పాయింట్నీ వదిలేసారు. ఇక యాక్షన్ & ఎమోషన్స్ సన్నివేశాలను బ్యాలన్స్ చేయడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు. అందువల్ల, ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టమే. సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా దాన్ని తెరపై చూపించడంలో ప్రవీణ్ సత్తారు పూర్తిగా విఫలం అయ్యారు. యాక్షన్ మీద ఎన్నో సినిమాలు వచ్చి  పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక గాండీవధారి అర్జున కూడా ఆ సినిమాల లిస్టులో చేరిపోతుంది.

ప్లస్ పాయింట్స్:

 

నటినటులు

నిర్మాణ విలువలు

సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్లు:

బలహీనమైన కథ

ప్రేక్షకులకి రొటీన్ గా అనిపించే స్క్రీన్ ప్లే

 

రేటింగ్: 2.5/5

 

ఇది కూడా చదవండి:

King of Kotha Movie Review: దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత్త’ హిట్టా..?, ఫట్టా..?

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం.. మొదట రాజమౌళి హీరోలుగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?

Bedurulanka 2012 review in telugu : బెదురులంక 2012 హిట్టా..? ఫట్టా..?

Related posts:

nene-vasthunna-movie-reviewDhanush : “నేనే వస్తున్నా” రివ్యూ Kabza Movie Review in Telugu: ఉపేంద్ర “కబ్జా” మూవీ రివ్యూ & రేటింగ్ Dasara Movie Review anad ratingNani Dasara Movie Review in Telugu: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..? vidudhala-movie-reviewVidudala Part 1 Movie Review in Telugu “విడుదల” సినిమా పార్ట్ -1 రివ్యూ & రేటింగ్

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd