Advertisement
ప్రతి ఒక్కరు కూడా పెళ్లి మీద అనేక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అమ్మాయిలు పెళ్లికి రెడీ అవుతున్నారా..? అయితే అబ్బాయిలని కచ్చితంగా ఈ ప్రశ్నలు అడగండి. పెళ్లంటే నూరేళ్లపంట. ఒక్కసారి మూడు ముళ్ళు పడితే జీవితాంతం ఆ వ్యక్తితోనే ఉండాలి పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం అంటారు. పెళ్లికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటూ ఉండాలి. అతను నాకు కరెక్ట్ ఏనా, ఆమె నాకు కరెక్ట్ ఏనా..? హ్యాపీగా ఉంటామా లేదా అనేది చూసుకోవాలి.
Advertisement
అమ్మాయిలైనా అబ్బాయిలైనా ముందు ఒకరినొకరు ఇష్టపడి తర్వాత వారి గురించి తెలుసుకోవడం ద్వారా బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు. అమ్మాయిలు పెళ్లి చేసుకునే ముందు ఆ వ్యక్తి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. వారిని ముఖ్యమైన విషయాలు అడగాలి. దీని వలన భవిష్యత్తు గురించి క్లారిటీ వస్తుంది. పెళ్లి చేసుకోవాలా వద్దా..? మనసులో మాట చెప్పవచ్చు. వివాహానికి ముందు అబ్బాయిలని ఎటువంటి ప్రశ్నలు అమ్మాయిలు అడగాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిలు ఏం అడగాలి అనే దాని గురించి చూస్తే.. కెరియర్ లక్ష్యాల గురించి కచ్చితంగా వారిని అడిగి తెలుసుకోవాలి.
Advertisement
Also read:
అప్పుడే మీ జీవితం పై మీకు క్లారిటీ వస్తుంది. అలాగే పిల్లలు కావాలా వద్దా, తల్లిదండ్రులు, ఫ్యామిలీ నేపథ్యం ఏంటి అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. అలానే వారి హాబీస్, లైఫ్ మీద వాళ్ళ అభిప్రాయం బాల్యం ఎలా ఉండేది, వీకెండ్స్ ఏం చేస్తారు?, ప్రయాణాలు చేయడం ఇష్టమా కాదా, స్నేహితులు ఉన్నారా, అమ్మాయిలను గౌరవిస్తారా ఇటువంటి విషయాలను అడిగి తెలుసుకోవాలి. అలానే ఆర్థిక విషయాల గురించి కూడా తెలుసుకోవాలి. వాళ్ళ జీతం వాళ్ళ ఖర్చులు వల సేవింగ్స్ వంటి విషయాలు గురించి అడిగి తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలుసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఉండవు. పైగా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!