Advertisement
ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా గూగుల్ సాఫ్ట్ వేర్ ను వినియోగిస్తున్నారు. ఎటువంటి వాటి గురించి అయినా సెకండ్ లో మనకు అందించే గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్లు ద్వారా మనకు కావలసిన వాటిని ఇట్టే చూపిస్తుంది. అందుకే గూగుల్ కు ప్రాచుర్యం రోజు రోజుకు పెరుగుతుంది. గూగుల్ ను వాడుతున్న వారి డేటా లేదా పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుతుంది. కానీ ఈ మధ్య వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి తీవ్రమైన చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
ఇది ఇలా ఉండగా,గూగుల్ కు మరోసారి భారీ షాక్ తగిలింది. గూగుల్ తన ప్లే స్టోర్ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తోందంటూ కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. గూగుల్ మార్కెట్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ రూ.936.44 కోట్లు జరిమానా వేసింది. తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. ఈ యాప్ డెవలపర్లు తమ యాప్, యూజర్లకు చేరాలంటే యాప్ స్టోర్ పై ఆధారపడాల్సి ఉంటుంది.
Advertisement
అయితే, దేశంలో వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో చాలావరకు ఆండ్రాయిడ్ వే. దీంతో యాప్ డెవలపర్లకు ప్లే స్టోర్ ఒక్కటే ఆధారంగా మారింది. ప్లే స్టోర్ లో తమ యాప్ లిస్ట్ చేయాలంటే గూగుల్ నియామాలను పాటించడంతో పాటు, గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టం ను అనుసరించాల్సి ఉంటుంది. దీంతో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని గమనించిన సిసిఐ, గూగుల్ కు పెనాల్టీ విధించింది. వారం తిరగకముందే గూగుల్ పై సీసీఐ విధించిన రెండో జరిమానా ఇది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టం తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందంటూ ఇటీవలే రూ. 1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
READ ALSO : పోలవరం ప్రాజెక్టుకు పవన్ నాలుగో పెళ్లికి లింకు పెట్టిన రాంబాబు!