Advertisement
మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘భీమా’. కన్నడ మాస్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెమీ ఫిక్షనల్ మూవీగా రూపొందింది. ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మరి కొన్నాళ్ల నుంచి సరైన హిట్టు లేని గోపీచంద్‌కి ఈ మూవీ హిట్ ఇచ్చిందా..? లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సినిమా : భీమా
నటీనటులు : గోపిచంద్, ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, సప్తగిరి, రఘుబాబు తదితరులు.
రచన-దర్శకత్వం : ఏ. హర్ష
నిర్మాత : రాధా మోహన్
సంగీతం : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ : స్వామి జె.గౌడ
ఎడిటర్ : తమ్మిరాజు
విడుదల తేదీ : మార్చి 08, 2024
కథ మరియు విశ్లేషణ :
భీమా మూవీ మొత్తం పరశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. ప్రధానంగా బెంగుళూరు, బాదామి.. పరిసర ప్రాంతాల్లో జరిగిన కథ. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘పరశురామక్షేత్రం’లో పలు ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని పోలీస్ ఆఫీసర్ భీమా ఎలా ఛేదించాడు? అతనికి పరశురామక్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే భీమా సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.
Advertisement
ఈ చిత్రంలో గోపిచంద్ ఎద్దు మీద కూర్చొని ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ హైలెట్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ కాస్త రొటిన్ గా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు చాలా కీలకం. యాక్షన్ తో పాటు కామెడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోలీస్ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంది. ఇందులో ప్రేమ, ఎమోషన్స్, రొ**మాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రధానంగా ఈ కథలో సెమి ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతీ యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. మొత్తానికి ఈ సినిమాలో గోపిచంద్ ఉగ్ర రూపాన్ని చూడవచ్చు. గోపిచంద్ ఖాతాలో హిట్ పడినట్టే స్పష్టంగా అర్థమవుతోంది.
పాజిటివ్ పాయింట్స్ :
- గోపిచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ నటన
- ఇంటర్వెల్ ఫైట్
- క్లైమాక్స్
- సంగీతం
మైనస్ పాయింట్స్ :
- సెకండాప్ రొటిన్
- మధ్యలో సాగదీత
రేటింగ్ : 3/5
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!