Advertisement
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. ప్రోటోకాల్ విషయంలో తెలంగాణ సర్కర్ పై అసహనం వ్యక్తం చేయడం.. బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేయడం.. ఇలా ఏదో ఒక ఇష్యూలో ఆమె పేరు ప్రజల్లో వినిపిస్తుంటుంది. అయితే.. గవర్నర్ కిందపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తమిళనాడులో జరిగింది.
Advertisement
మార్టిన్ ఫౌండేషన్ అనే సంస్థ, ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ అండ్ స్పేస్ జోన్ ఇండియాతో కలిసి హైబ్రీడ్ సౌండింగ్ రాకెట్ ను తయారు చేసింది. చెంగల్ పట్టు సమీపంలోని పట్టిపురం నుంచి రాకెట్ ను ప్రయోగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లారు తమిళి సై. అయితే.. వేదిక వద్దకు నడుచుకుంటూ వెళుతూ కాలు జారి కిందపడ్డారు. వెంటనే సహాయక సిబ్బంది ఆమెను పైకి లేపారు.
Advertisement
ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, తాను కిందపడిన ఈ వార్త టీవీల్లో హైలైట్ అవుతుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి పెద్దగా చర్చ జరుగుతుందో లేదో కానీ తాను కింద పడిపోవడం మాత్రం పెద్ద వార్తవుతుందన్నారు. ఆమె అన్నట్టే అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో హెడ్ లైన్స్ కు ఎక్కింది. వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సుమారు 3500 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 6 నుంచి 12వ తరగతి చదివే 5వేల మంది విద్యార్థులు తయారుచేసిన 150 మినీ హైబ్రిడ్ ఉపగ్రహాల(పైకో శాటిలైట్స్)ను ప్రయోగించారు.