Advertisement
ఏపీ రాజకీయాల్లో జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు ప్రతిపక్షాలుగా కీలక పాత్ర వహిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా చెప్పకపోయినా, ఈ రెండు పార్టీల కలయిక అనివార్యం అయ్యేలాగే ఉంది.
Advertisement
ఈ తరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ బెటర్, 175 సీట్లలో పోటీ చేస్తాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశాలు పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారని, అన్ని వర్గాలతో మేము తరచూ సమావేశాలు నిర్వహించుకున్నామని తెలిపారు. జనసేన పొలిటికల్ పార్టీ కాదు, సినిమా పార్టీ అని, విధానం సిద్ధాంతం లేని జనసేన పార్టీ అని చురకలు అంటించారు.
Advertisement
దాని గురించి మేము మాట్లాడవలసిన అవసరం లేదని, సినిమాల్లో ఉన్న వ్యక్తి సినిమా స్టైల్ లో మాట్లాడితే సినిమాల్లో పనికొస్తుంది. ప్రజాస్వామ్యంలో పనికి రాదని విమర్శలు చేశారు. దీన్ని సమాజం ఖండించాల్సిన అవసరం ఉందని, పవన్ కళ్యాణ్ పదిమందితో ప్రభుత్వం వస్తుందా? అని ఆగ్రహించారు. జనసేన నేతలు కార్యకర్తలు పవన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే, పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని, రేపు చంద్రబాబుకి జనసేన సైనికులు బానిసలుగా బతకాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కంటే కేఏ పాల్ నయం. 175 సీట్లు పోటీ చేస్తున్నది చెప్తున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఊహించినదే. వారు కలవడం, విడిపోవడం సహజమేనన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.