Advertisement
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకి విమర్శలు చేసేందుకు అవకాశాన్ని ఇవ్వట్లేదు తెలంగాణ రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుండి తనదైన మార్క్ వేసుకున్నారు. ఎవరికీ కూడా అవకాశమే ఇవ్వకుండా ఆయన పని చేస్తున్నారు. అలానే ఆయన ఎటువంటి వెనకడుగు కూడా వేయట్లేదు. ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం అవకాశం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Advertisement
తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి శుభవార్త చెప్పారు రేవంత్ యాసంగి సీజన్ కి సంబంధించిన రైతు బంధు నిధులని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఒక రైతు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటానని నేటి నుండి పెట్టుబడి సహాయం అందించాలని రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు.
Advertisement
రైతులకి పంట పెట్టుబడి సహాయం కింద 15000 రూపాయలు ఇస్తామని రేవంత్ చెప్పారు. ఆ పెట్టుబడి సహాయం ఎప్పుడు ఇస్తారో రైతులకి చెప్పాలని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై సీతక్క వంటి వాళ్ళు కౌంటర్ ఇచ్చినా రేవంత్ రెడ్డి సైలెంట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సహాయం అందించాలని రైతుల్ని ఆదుకోవాలని అధికారులకు సూచించి హరీష్ రావు నోరు మూతపడేలా రేవంత్ రెడ్డి చేశారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!