Advertisement
సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ దర్శకత్వంలో హరోం హరా సినిమా ప్రేక్షకులు ముందుకి ఈ రోజు వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ తోనే ప్రేక్షకులందరికీ బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ తోనే దాదాపు 5 నుండి 6 కోట్ల దాకా బిజినెస్ జరిపింది. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ గురించి చూద్దాము.
Advertisement
సినిమా: హరోంహర
నటీ నటులు: సుధీర్ బాబు, మాళవిక, సునీల్ తదితరులు
దర్శకుడు: జ్ఞాన సాగర్
సంగీతం: చేతన్ భరద్వాజ్
రిలీజ్ డేట్: 14-06-2024
కథ మరియు వివరణ:
కథలోకి వెళ్ళిపోతే.. సుధీర్ బాబు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉంటాడు. టార్గెట్ మాత్రం డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అని. డబ్బులు బాగా సంపాదించి టాప్ పొజిషన్లో ఉండడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో ల్యాబ్ అసిస్టెంట్ గా ఉంటే తనకు వచ్చే జీతం సరిపోలేదు అన్న ఉద్దేశంతో గన్స్ ని తయారు చేస్తాడు. ఆ ప్రాసెస్ లో తన వాళ్లకి గన్స్ ని వాడడం పరిచయం చేయడం కోసమే ఈ సినిమా మొత్తం సాగుతుంది. ఈ సినిమాలో సుధీర్ బాబుకి రౌడీలకు మధ్య గొడవ జరుగుతుంది. వాళ్ళు అతని ఎందుకు చంపాలనుకుంటారు అనేది తెలియాలంటే మూవీ చూడాలి.
Advertisement
జ్ఞాన సాగర సినిమా స్టోరీని ఏ ఉద్దేశంతో రాసుకున్నాడో తెలియదు. కానీ ఇందులో ఉన్న ప్రతి సీను కూడా మనకి ఏదో ఒక సినిమాలో ఇంతకుముందు చూసినట్లు ఉంటుంది ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం వచ్చే సీన్లు కేజిఎఫ్ పుష్ప వంటి సినిమాలు నుండి తీసుకునట్లు క్లియర్ కట్ గా ఉంటాయి. చత్రపతి మూవీలో చత్రపతి అనే ఒక ఎలివేటెడ్ ని కూడా ఈ సినిమాలో వాడారు. మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ దాకా సగటు ప్రేక్షకుడిని ఎంగేజింగ్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్లను చాలా వరకు సాగదీశారు.
రొటీన్ స్టోరీలా ఉంటుంది. ఇది ప్రేక్షకుడికి పెద్దగా ఆకట్టుకోదు. సినిమాలో ఇది చాలా వరకు మైనస్ అయింది. మొత్తానికి సుధీర్ బాబుకి ఈ సినిమా ప్లస్ అవ్వలేదు. చిన్న హీరోలు మాస్ సినిమాలు చేయాలనుకోవడం పెద్ద తప్పు అని చెప్పొచ్చు. ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే చిత్తూరు యాసలో డైలాగ్ లను సుధీర్ బాబు బాగా చెప్పాడు. ఆశించినట్లుగా ఈ సినిమాతో మంచి పేరైతే అయితే అందుకోలేకపోయాడు. సునీల్ కి ఈ సినిమాలో ఫుల్ లెన్త్ పాత్రను ఇచ్చినా పెద్దగా నటించింది ఏమీ లేదు. టెక్నికల్ విషయాలకి వచ్చేస్తే చేతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ మాత్రం సినిమాకు చాలా దాకా ప్లస్ అయింది. ఈ సినిమాలో విజువల్స్ కూడా సినిమాకి కొంత దాకా ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
సుధీర్ బాబు నటన
మొదటి భాగం
మైనస్ పాయింట్స్:
సెకండ్ పార్ట్
కొన్ని సీన్లు ల్యాగ్ అవ్వడం
రొటీన్ సీన్లు
రేటింగ్: 2/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!