Advertisement
నిత్యవసర సరుకులలో ఎంతో ముఖ్యమైన పెట్రోల్, పాలు, వాటర్ వంటి వాటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకు వెళ్లే ట్యాంకర్లని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇవి గుండ్రంగానే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన నిత్యవసర సరుకులలో పాలు, పెట్రోల్, నీళ్లు అన్నీ కూడా ద్రవపదార్థాలే. ఇలా ద్రవపదార్థాలను ఎప్పుడు గుండ్రంగా ఉన్నటువంటి ట్యాంకర్లలో తీసుకువస్తుంటారు కానీ చతురస్రాకారంలో గాని, దీర్ఘ చతురస్రాకారంలో కానీ నీటి, ఆయిల్ ట్యాంకర్లు ఉండవు. రౌండ్ ఆకారంతోపాటు కొన్ని సిలిండ్రికల్ ఆకారంలోనే ఉంటాయి.
Advertisement
Read also: మరింత ప్రమాదకరంగా “తారకరత్న” ఆరోగ్యం మారిందా ? ?
ఇలా గుండ్రంగా ఉండడానికి కారణం ఏంటంటే.. చమురు, పాలు లేదా నీరు మూడు ద్రవాలు కాబట్టి మొత్తంగా మనం పెద్ద పరిణామంలో ద్రవాలను సరఫరా చేయడానికి స్థూపాకార ట్యాంకర్లు ఉపయోగిస్తున్నారని గమనించవచ్చు. కొంచెం చరిత్రను అన్వేషిస్తే గుండ్రని ట్యాంకర్ మొదట పెట్రోల్ కోసం మాత్రమే ఉపయోగించారు. ఇప్పుడు అన్ని రకాల ద్రవాలకు వినియోగిస్తున్నారు. మనం ఎందులోనైనా ద్రవాన్ని ఉంచినప్పుడు ఆ పదార్థం ఒత్తిడిని సృష్టిస్తుందని, దాని కారణంగా మూలాల ద్వారా శక్తి ప్రయోగితమవుతుందని సైన్స్ చెబుతోంది. అటువంటి పరిస్థితిలో ట్యాంకర్ గుండ్రని ఆకారంలో కాకుండా చతురస్రాకారంలో ఉంటే దాని లైఫ్ టైం ఘననీయంగా తగ్గుతుంది. ట్యాంకర్ మూలాలు ఒత్తిడి కారణంగా త్వరగా పాడవుతాయి.
Advertisement
అయితే గుండ్రని ట్యాంకర్ లో మూలాలు లేనందున ఒత్తిడిని ప్రయోగించినప్పుడు ద్రవం బయటకు వెలువడేందుకు అవకాశం ఉండదు. అలాగే ద్రవపదార్థాలు, వాయువులు, నీరు వంటి పదార్థాలు తీసుకువెళ్లే వాహనం ఎక్కువగా స్థిరత్వం కలిగి ఉండాలి. గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండాలి. అంటే భూమికి వీలు అయినంత దగ్గరగా ఉండాలి. అయితే ట్యాంకర్లు రౌండ్ ఆకారంలో ఉంటేనే భూమికి దగ్గర ఉంటుంది. అదే దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటే పైన ఉండే భాగం భూమికి దూరంగా ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల ద్రవపదార్థాలు, వాయువులు తీసుకువెళ్లేటువంటి ట్యాంకర్లను రౌండ్ ఆకారంలో ఉంచుతారు.