Advertisement
తెలుగు ఇండస్ట్రీని టాప్ లెవల్లో దేశం గర్వించదగ్గ రేంజ్ కు తీసుకెళ్ళిన హీరోలలో ముందువరుసలో ఉండేది అలనాటి హీరో నందమూరి తారక రామారావు. ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఎదిగారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అలాంటి అన్న ఎన్టీఆర్ తన కూతురు చంద్రబాబు నాయుడుకీ ఇచ్చి వివాహం చేశాడు.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మెల్లి మెల్లిగా మామ ఎన్టీఆర్ ను పక్కకు తోసి టిడిపి పగ్గాలు చేతపట్టి చివరికి ఆయన కూడా ఏపీ సీఎం అయ్యారు..
Advertisement
also read: హీరోయిన్ సౌందర్యను పోలి ఉన్న జూనియర్ సౌందర్య.. చూస్తే ఫిదా అయిపోతారు..!!
చంద్రబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. అయితే ఆయన పెళ్లికీ సంబంధించి చంద్రబాబు నాయుడు ఆహ్వానించిన పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరితో నా పెళ్లి అని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానిస్తున్నట్టు గా ఈ కార్డులో ఉంది. చంద్రబాబు మరియు భువనేశ్వరిల పెళ్లి 1981 సెప్టెంబర్ 10వ తేదీన చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. అప్పటికే చంద్రబాబునాయుడు ఏపీ కాంగ్రెస్ సర్కారులో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ హీరోగా ఉన్నారు.
Advertisement
దీంతో వీరి పెళ్లికి పలు రాజకీయ ప్రముఖులతో పాటుగా సినిమా స్టార్లు కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఇక చంద్రబాబు కట్నకానుకల విషయానికి వస్తే చంద్రబాబు కట్నం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నారట.. చంద్రబాబు అడిగిన సందర్భం లేదు ఎన్టీఆర్ ఇచ్చిన సందర్భం కూడా లేదట. కానీ వివాహం మాత్రం చాలా గ్రాండ్ గా జరిగిందని తెలుస్తోంది.. చంద్రబాబు స్వయంగా తన పెళ్ళికి ఆహ్వానం పలికేందుకు పెళ్లి పత్రిక పసుపు రంగు, కార్డుపై పచ్చని రాతతో రాసి ఉన్న కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
also read:హీరో దుల్కర్ సల్మాన్ భార్యకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మీకు తెలుసా..!!