Advertisement
హీరో వేణు అప్పట్లో వరుస సినిమాలతో ఒక వెలుగు వెలిగి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఎంత ఫాస్ట్ గా ఎదిగారో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీకి దూరమయ్యారు.. స్వయంవరం, హనుమాన్ జంక్షన్, చిరునవ్వుతో వంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. అంతేకాకుండా పెళ్ళాం ఊరెళితే, ఖుషి ఖుషి గా, కళ్యాణ రాముడు, శ్రీకృష్ణ 2006, యమగోల మళ్లీ మొదలైంది. వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంత స్పీడ్ గా ఇండస్ట్రీలో ఎదిగారో అంతే స్పీడ్ గా దూరమయ్యారు.
Advertisement
దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. అలాంటి వేణు వ్యక్తిగత జీవితానికి వస్తే అతని భార్య గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఆయన భార్య పేరు అనుపమా చౌదరి. ఈమెకు వేణు కుటుంబంతో బంధుత్వం ఉందట. కాబట్టి వీరిద్దరూ ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్నారు. ఒక రకంగా లవ్ మ్యారేజ్ అని చెప్పవచ్చు. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నారు. అలాంటి అనుపమ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తి చేసింది. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకుందట. ఇక వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలకు పైనే అయిందని సమాచారం.
Advertisement
అనుపమ” ఫెజేస్ ఇన్ టైం” అనే ఒక స్క్రాప్ బుకింగ్ బిజినెస్ రన్ చేస్తుందట. అంటే ఒకరికి సంబంధించిన మెమొరీస్ అన్ని కలెక్ట్ చేసి ఒక స్క్రాప్ బుక్ రూపంలో ఇవ్వడం. ఇది ఒక్క స్టోర్లో మాత్రమే కాకుండా వేరే ప్రదేశాలకు కూడా షిప్పింగ్ చేసేలా ఆమె ప్లాన్ చేశారట. ఈ విధంగా వేణు మరియు అతని భార్య రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే ఇటీవలే వేణు రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై వేణును ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా టైం వస్తే వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు.
also read:వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?