Advertisement
Actor VijayKanth Death: నటుడు విజయ్ కాంత్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. విజయ్ కాంత్ ఈరోజు ఉదయం కరోనా కారణంగా చనిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనకి చెన్నై లోని ఒక హాస్పిటల్లో చికిత్స అందించారు. శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉండడం తో ఆయన కన్నుమూశారు. ఆయన కన్నుమూసినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణ వార్త విన్న పార్టీ శ్రేణులు కంటతడి పెట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా విజయ్ కాంత్ ఆరోగ్యం బాగోలేదు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన బాధపడుతున్నారు.
Advertisement
రీసెంట్ గా ఆయన ఆరోగ్యం మీద అనేక పుకార్లు వచ్చాయి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటూ ఉండగా మరణించారు అని రూమర్లు కూడా వచ్చాయి. అందరూ అయినా చనిపోయారని ట్వీట్ లు కూడా పెట్టారు. కానీ ఆయన బతికే ఉన్నట్లు అప్పుడు హాస్పిటల్ వర్గాలు చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇటు డిడిఎంకే కార్యకర్తలు అటు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. నెటిజెన్స్ కూడా ఆయన మృతి పట్ల స్పందిస్తూ రిప్లై ఇస్తున్నారు. 47 ఏళ్ల సినీ రంగం 20 ఏళ్లకు పైగా రాజకీయ రంగంలో ఆయన సేవలందించారు.
Advertisement
కెప్టెన్ గా అగ్ర స్థానాన్ని ఆయన సినిమాలతో చేరుకున్నారు కానీ రాజకీయాల్లో మాత్రం అంతగా సక్సెస్ కాలేదు ఆయన మరణం కోలీవుడ్ ప్రేక్షకులకి తీరని లోటు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత ఎప్పటికప్పుడు ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటూనే ఉన్నారట. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విజయకాంత్ కి దగ్గు, జ్వరం, జలుబు వచ్చిందట. సో 18న చెన్నై గిండి సమీపం లోని మణపాక్‌లోని మియాట్ హాస్పటల్ లో చేరారు. ఐసీయులో చికిత్స అందించారు వైధ్యులు. కొన్నాళ్లు కృత్రిమ శ్వాస అందించారు. తర్వాత కొద్ది రోజులకు ఆయన ఆరోగ్యం బాగుండడంతో 12న ఆయనను డిశ్చార్జీ చేశారు వైద్యులు. కానీ ఇలా అవుతుందని ఎవరూ అనుకోలేదు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!