Advertisement
సాధారణంగా చాలామంది పెళ్లి చేసుకునే సమయంలో వారి సొంత మరదల్లని చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సాధారణ జనాల్లో ఇది ఎక్కువగా కనబడుతుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ రేంజ్ కి వచ్చాక సాధారణ జనాల లాగే సొంత మరదళ్ల ను పెళ్లి చేసుకొని జీవితంలో సెట్ అయిన హీరోలు అనేక మంది ఉన్నారు. బయట ఎంత పెద్ద సంబంధాలు వచ్చినా వారి సొంత మరదళ్లనే పెళ్లి చేసుకొని జీవితాన్ని ఆస్వాదించిన ఈ టాప్ హీరోలు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.. ఈ హీరోలో మన తెలుగు హీరోలు ఎక్కువమంది ఉన్నారట.. వారెవరో మీరు కూడా ఓ లుక్కేయండి..
ఏఎన్ఆర్-అన్నపూర్ణ :
Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆయన కావాలనుకుంటే పెద్ద పెద్ద సంబంధాలు కూడా వచ్చేవి. కానీ వాటన్నింటిని పక్కన పెట్టి తన సొంత మరదలు అయిన అన్నపూర్ణను 1949లో పెళ్లి చేసుకున్నారు. ఏఎన్ఆర్ అప్పటికే 10 సినిమాల్లో నటించారు.
ఎన్టీఆర్-బసవతారకం:
Advertisement
తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఎన్టీఆర్ తన సొంత మరదలు అయిన బసవతారకంను వివాహం చేసుకున్నారు. అప్పటికి ఎన్టీఆర్ సినిమాల్లోకి రాలేదు.
కృష్ణ-ఇందిరా దేవి :
కృష్ణ కూడా తన సొంత మరదలైన ఇందిరా దేవిని 1961 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తను హీరోగా మొదటి సినిమా విడుదలైంది.
మోహన్ బాబు-విద్యాదేవి మరియు నిర్మలాదేవి :
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అలనాటి సీనియర్ హీరోల మాదిరిగానే తన సొంత మరదలు అయిన విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె హఠాత్మరణం చెందడంతో తన సొంత చెల్లెలైన నిర్మల దేవిని పెళ్లి చేసుకున్నారు.
ఆది-అరుణ:
సాయికుమార్ వారసుడైన ఆది తన సొంత మరదలినే వివాహం చేసుకున్నారు. అండర్ 19 క్రికెట్ ఆడిన ఆది తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 2014లో తన మేనమామ కూతురైన అరుణను వివాహమాడారు.
also read:ఇద్దరు భార్యలు మరణించడంతో.. కృష్ణకు ఇలా జరిగిందా ?