Advertisement
ఆ సమయంలో కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు అంటే మామూలు విషయం కాదు. కానీ ఎలాగైనా మంచి కథతో బడ్జెట్ ఎక్కువైనా సరే సినిమా తీసుకురావాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్న సమయం. ఈ సమయంలోనే భారీ బడ్జెట్ పెట్టి తీవ్రంగా నష్టాల పాలైన సినిమా అశ్వమేథం. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ సూపర్ హిట్ కావడంతో, బాలకృష్ణతో ఒక సినిమా తీయాలని ఆలోచనలో పడ్డారు అశ్వనీదత్. దీంతో వైజయంతి మూవీస్ బ్యానర్ నందమూరి తారక రామారావు చేతుల మీదుగా నిర్మాణ సంస్థను ప్రారంభించిన అశ్వనీదత్ ఎన్టీఆర్ తో రెండు సినిమాలు హిట్ కొట్టారు.
Advertisement
ఎన్టీఆర్ నట వారసుడు నటసింహం నందమూరి బాలకృష్ణతో ఒక మంచి సినిమా తీయాలని భావించారు. అప్పటి వరకు బాలకృష్ణ మరియు శ్రీదేవి కాంబినేషన్ రాలేదు. వారిద్దరితో మూవీ తీయాలనుకున్నారు. వీరిద్దరి దగ్గర డేట్స్ కూడా తీసుకున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు అనుకున్నారు. కానీ కొన్ని అవాంతరాల వల్ల మూవీ ఆగిపోయింది. అయినా అశ్వినిదత్ వెనక్కి తగ్గకుండా చాలా రోజులు కష్టపడి మరో మంచి కథను రెడీ చేశారు. నటభూషన్ శోభన్ బాబు, నటసింహం బాలకృష్ణ ఇద్దరిని కలిపి అశ్వమేథం షూటింగ్ ప్రారంభించారు. 1992 జూన్ 22 అన్నపూర్ణ స్టూడియోస్ లో మూవీ స్టార్ట్ అయింది. శోభన్ బాబు, బాలకృష్ణ, మీనా, నగ్మా బాబు మోహన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు,ప్రసాద్ బాబు వంటి నటీనటులతో అశ్వమేధం షూటింగ్ మొదలైంది.
Advertisement
ఇందులో శోభన్బాబు జంటగా గీత నటించారు. అలాగే ఈ సినిమాలో ముగ్గురు విలన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందించారు. సూపర్ హిట్ అయిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఆ సమయంలో రెండు కోట్ల బడ్జెట్ పెడితే, కానీ ఈ సినిమాకు మాత్రం మూడు కోట్ల బడ్జెట్ పెట్టారు అశ్వినీదత్. ఎక్కడ కూడా తగ్గేది లేదు అనుకుంటూ ఖర్చు చేశారు.1992 డిసెంబర్ 25 అశ్వమేథం సినిమా రిలీజ్ అయింది. కానీ సినిమా మామూలు స్పందన వచ్చింది. 8 కేంద్రాలలో అశ్వమేథం సినిమా 50 రోజులు, అయినా అశ్వనీదత్ ఊహించనంత ఫలితం రాలేదు. అంతమంది అగ్ర నటులు నటించిన కమర్షియల్ గా నష్టాలనే మిగిల్చిందట.
also read: