Advertisement
పూర్వకాలంలో ఐదు రోజుల పెళ్లిళ్లని, 16 రోజుల పండుగ అని పెళ్లిల్లని ఎంతో ఘనంగా నిర్వహించేవారు. కానీ నేటితరం యువతి, యువకులకి జీవితం వేగవంతమైన కారు ప్రయాణంలా తయారైంది. ప్రయాణం చేయడమే కానీ డ్రైవింగ్ నియమాలు, నిబంధనలతో వీరికి అవసరం లేదు. అలాంటి ఈ తరుణంలో ఒక్కరోజు పెళ్లే గగనం అయిపోయింది. ఎక్కువసేపు కూర్చోవడం ఇష్టం లేక మంగళసూత్రం కట్టేస్తే చాలు పెళ్లి అయిపోతుంది అన్న భ్రమలో ఉండి.. తూ తూ మంత్రంగా చేయించేస్తున్నారు. ఇక వీటితోపాటు ప్రేమ వివాహాలు, పెద్దలు ఒప్పుకోలేదని సంతకాల పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి.
Advertisement
Read also: SAMANTHA : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?
అసలు మన వివాహ పద్ధతి, వాటి విధి విధానాలు చాలామందికి ఎక్కువగా అవగాహన ఉండకపోవచ్చు. ఇందులో ఒకటి హిందూ వివాహ పద్ధతిలో ఆడపడుచు చేతనే పెళ్ళికొడుకుని ఎందుకు చేయిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి రోజుకు ఒక రోజు ముందర స్నాతకం అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్లి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి అన్ని ప్రయశ్చితాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. ఇదిలా ఉంటే.. ఆడపడుచు చేత పెళ్లి కొడుకును ఎందుకు చేయిస్తారనే విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు.
Advertisement
ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళగానే తన పుట్టింటితో తనకి అనుబంధము, హక్కులు పోయాయని, అందరికీ దూరమయ్యానని బాధపడుతుంది. అలాంటిదేమీ లేదని చెప్పడానికి తన పుట్టింట్లో తన హక్కులు అలాగే ఉన్నాయని చెప్పి, వివాహ సమయంలో తోడబుట్టిన వాడిని పెళ్ళికొడుకుని చేయించడం దగ్గర నుంచి ఆమెకి లాంఛనాలు ఇప్పించడం వరకు వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే వారు వివాహం చేసుకొని అత్తారింటికి వెళ్లిన తర్వాత ఆడపిల్లలను మగ పిల్లలు పట్టించుకోరేమోనని ముందు నుంచి ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పనిసరి అని, ఆమె చేతుల మీదుగానే ఏ శుభకార్యాన్ని అయినా ప్రారంభించాలని చెప్పడం ప్రధాన ఉద్దేశం.
Read also: ముస్లిం అయిన శ్రీహాన్ హిందూ పేరు ఎందుకు పెట్టుకున్నాడు.. బిగ్ బాస్ రన్నర్ గురించి షాకింగ్ నిజాలు..!