Advertisement
మన ఇండియాలో హిందూ ధర్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే విశిష్టత చరిత్ర కూడా ఉంది. ఈ హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా మన ఇండియన్స్ పాటిస్తారు. ఇండియా లో 70 శాతం హిందువులు ఉండటంతో… హిందూ మతానికి ఇంత ప్రాచుర్యం, ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఈ హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. వాటిని కింద కానీ, అశుభ్రమైన ప్రదేశాలలో కానీ, మంచం మీద కాని పెట్టము. పూజకు ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్బత్తీలు, కర్పూరం…లాంటి వస్తువులను కింద పెట్టము, ఒకవేళ కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించము. ఆలా ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని హిందువుల నమ్మకం. ఇంతకీ అసలు కింద పెట్టకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
Advertisement
దీపం: దేవుడి ముందు పెట్టే దీపాలను నేలమీద ఎట్టిపరిస్థితిలోనూ పెట్టరాదు. వాటిని వెలిగించిన, వెలిగించ కపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రం పైనే ఉంచాలి. ఇలా నేలపై పెట్టరాదు. అలా చేస్తే దేవుళ్ళు, దేవతలను అవమానించినట్టే అవుతుందట.
Advertisement
బంగారం: బంగారాన్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేస్తే వారి వద్ద ధనం నిలవదట. అన్నీ సమస్యలే వస్తాయట.
జంధ్యం: హిందువుల్లో చాలామందికి జంధ్యాన్ని ధరించే ఆచారం ఉంటుంది. అయితే దాన్ని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు. తల్లిదండ్రులు, గురువులకు ప్రతిరూపంగా దాన్ని భావిస్తారట. ఆ క్రమంలో జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట. అందుకని దానిని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు.
శంకువు: శంకువు లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరాదు. అలా పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
శివలింగం: శివలింగం నేలపై అస్సలు పెట్టకూడదట. అలా చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయఅట. ఒకవేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచారట.
Also Read: