Advertisement
రవితేజ అల్లరి నరేష్ శివ బాలాజీ హీరోలుగా వచ్చిన శంభో శివ శంభో సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సినిమా చాలా న్యాచురల్ గా రియాలిటీ కి బాగా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అంతగా జనాల అభిమానాన్ని దక్కించుకుంది ఈ మూవీ. ఈ సినిమాలో జరిగినట్లుగానే నిజజీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది దాన్ని ఆధారంగా తీసుకుని దర్శకుడు సినిమాని తెరమీదకి తీసుకువచ్చారు. నిజజీవితంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ ఎవరూ చేయకూడదనే ఉద్దేశంతో దర్శకుడు ఈ సినిమాని తీసుకురావడం జరిగింది.
Advertisement
ఇక అసలు రియల్ స్టోరీ ఏంటి అనేది చూద్దాం ఈ సినిమాల్లో నటించినట్లుగానే ముగ్గురు ఫ్రెండ్స్ నిజజీవితంలో కూడా ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒక పాత్ర దర్శకుడు మిగిలిన ఇద్దరు అతను స్నేహితులు ఇంతకీ ఆ పాత్ర ఎవరితో తెలుసా..? ఎవరో కాదు దర్శకుడు సముద్రఖని తన జీవితంలో నిజంగానే ఇద్దరు ప్రేమికులకి పెళ్లి చేశారు. సముద్రఖని అతని స్నేహితులు ఎంతో కష్టపడి నిలబడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారట కానీ వాళ్ళు చిన్న చిన్న కారణాల వలన గొడవపడి విడిపోయారు. ప్రేమ పెళ్లి విలువ తెలియని వాళ్ళకి పెళ్లి చేసే కష్టాలు అనుభవించడం ఎంతటి తప్పు తెలియాలని ఆ తప్పు ఇంకెవరూ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ సినిమాను తీసుకువచ్చారు.
Advertisement
ఈ ముగ్గురు స్నేహితుల్లో నిజజీవితంలో సముద్రఖని పాత్రని అల్లరి నరేష్ పోషించారు ఈ సినిమా చూసి కొంతమంది మారతారు అన్న నమ్మకంతో సొంత కథని తెరమీదకి తీసుకువచ్చారు. నిజానికి ప్రేమను నిలబెట్టుకోలేని ఆ ప్రేమికులే దురదృష్టవంతులు అయితే ఈ సినిమా స్టోరీ రియల్ లైఫ్ లో జరిగిందన్న విషయం చాలామందికి తెలియదు అయితే సముద్రఖని జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా శంభో శివ శంభో సినిమాని తెర మీదకు తీసుకువచ్చారు. ప్రేమలో సక్సెస్ అవడం అంత ఈజీ కాదు సక్సెస్ అయిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఈ విషయాన్ని ప్రేమికుల గ్రహించి అర్థం చేసుకుంటూ ఉంటే జీవితం బాగుంటుంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!