Advertisement
House Vaastu Telugu: రోజువారి జీవితంలో మనకు ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మనిషి జీవితంలో మంచి జరిగేటప్పుడు ఎటువంటి శుభసంకేతాలు కనిపిస్తాయో.. అలాగే చెడు జరిగేటప్పుడు కూడా అశుభ సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని విషయాలు ఎందుకు అలా జరుగుతాయనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఈ సంఘటనల ఆధారంగా కొన్నిసార్లు మనకు ధనప్రాప్తి ఉంటుంది. మరి కొన్నిసార్లు నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే మన చుట్టూ జరిగే విషయాలలో మన కంటికి తక్కువ కనిపిస్తాయి. వేరే విషయాల గురించి మనసులో ఆలోచన చేయడం వల్ల కంటికి కనిపించేది చాలా తక్కువ. అందువల్ల అవసరమైన విషయాల గురించి తెలుసుకోలేరు.
Advertisement
Read also: వేల కోట్ల ఆస్తులకి వారసురాలైన అక్కినేని అమల ఆమె మేడలో తులం బంగారం కూడా ఎందుకు పెట్టుకోరంటే ?
Advertisement
జీవితంలో కష్టసుఖాలు సహజమే. కానీ మన జీవితంలో శుభాలను సూచించే శుభసంకేతాలను గుర్తించడం కంటే.. అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అలా అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేర కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మాత్రం ఆ ఇంటిని కచ్చితంగా విడిచి పెట్టాలి. మొదట ఏ భూమిలో అయితే సహజ సిద్ధంగా బొగ్గు పడుతుందో ఆ ప్రదేశంలో ఇంటిని నిర్మించుకోకూడదు. అలాగే ఏ భూమిలో అయితే తవ్వినప్పుడు ఎముకలు కనిపిస్తాయో ఆ ప్రదేశంలో ఇంటిని నిర్మించుకోకూడదని శాస్త్రం చెబుతుంది. అలాగే భయంకరమైన ముల్ల చెట్లు ఏ ప్రదేశంలోనైతే పెరుగుతాయో ఆ ప్రదేశంలో ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. ఆ ప్రదేశాలు ఉండడానికి యోగ్యమైనవి కాదని శాస్త్రం చెబుతుంది. అలాగే ఏ ప్రదేశంలోనైతే సహజ సిద్ధంగా దుర్వాసన వస్తుందో ఆ ప్రదేశంలో ఉండకూడదు. ఇక ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మాత్రం ఆ ఇంటిని విడిచి పెట్టాల్సిందే. అవేంటంటే..
1) ఏ ఇంట్లో అయితే పూర్తిగా సూర్యరశ్మి పడదో ఆ ఇంట్లో ఉండకూడదు.
2) ఏ ఇంటిలో అయితే వెంటిలేషన్ సరిగ్గా ఉండదో ఆ ఇంట్లో కూడా ఉండకూడదు.
3) ఏ ఇంట్లో అయితే విపరీతమైన బూజు అనేది ఉంటుందో ఆ ఇంట్లో ఉండకూడదు.
4) ఏ ఇంట్లో అయితే పదికి మించి బల్లులు ఉంటాయో ఆ ఇంట్లో ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. తరచూ ఇంట్లో బల్లుల శబ్దం వినిపిస్తే ఆ ఇంటిని ఇక వదిలేయాల్సిందే.
5) ఏ ఇంట్లో అయితే చెదలు ఎక్కువగా పడతాయో ఆ ఇంట్లో ఉండకూడదు. చెదని ఏకస్మృత జీవులు అంటారు. తినడం తప్ప వీటికి ఇంకేమీ తెలియదు. చేదలు ఎక్కువగా పట్టిన ఇంటిని వదిలేయాలని శాస్త్రం చెబుతుంది.
Read also: వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?