Advertisement
ఎప్పుడైనా అమ్మాయికి లేదంటే అబ్బాయికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటే ముందు దగ్గర బంధువులు పిల్లలు ఎవరైనా ఉన్నారేమో చూసుకుని వాళ్లకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళ బిడ్డ సంతోషంగా ఉంటుందా లేదా అని మొదట మేనరికపు వివాహాల కోసం చూస్తూ ఉంటారు. అన్నయ్య పిల్లలు తమ్ముడు పిల్లలు ఉంటే అమ్మాయి తల్లి లేదా అబ్బాయి తల్లి వాళ్లని అడిగి పెళ్లిని చేస్తారు.
Advertisement
ఈ రోజుల్లో ఈ పెళ్లిలు తగ్గాయి. కానీ ఇదివరకు ఎక్కువగా బంధువులనే వివాహాలు చేసుకునేవారు. వీటిని మేనరికం పెళ్లిళ్లు అని పిలిచేవారు. పాతకాలం నుండి కూడా ఈ సంప్రదాయం వుంది. అయితే ఈ రోజుల్లో జనాల్లో అవగాహన పెరిగి ఇది తగ్గింది. మరదల్ని కానీ మేనకోడల్ని కానీ ఇదివరకు ఎక్కువమంది పెళ్లి చేసుకునేవారు అయితే ఈ వివాహ విషయంలో కొంతమంది ఆనందంగా ఉంటే కొంతమందిలో సమస్యలు కలిగాయి దీంతో ఇలా పెళ్లిళ్లు చేసుకోవడానికి భయపడుతున్నారు. పుట్టబోయే బిడ్డకు రకరకాల అనారోగ్య సమస్యలు ఇలాంటి పెళ్లిళ్ల వల్ల కలుగుతాయి. ప్రధానంగా అంగవైకల్యం వస్తుంది దీని వెనక ముఖ్య కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవడం వలన పుట్టబోయే బిడ్డకి తల్లి నుండి 23 క్రోమోజోములు తండ్రి నుండి 23 క్రోమోజోములు వస్తాయని నిపుణులు అంటున్నారు ఇలా వచ్చే క్రోమోజోములు తల్లిదండ్రుల నుండి బిడ్డకు ముఖ్యమైన సమాచారాన్ని చేరుస్తాయి అని సైన్స్ అంటోంది. అయితే పెళ్లి చేసుకున్న జంట బ్లడ్ రిలేషన్ వాళ్లు కాకపోతే బిడ్డకు సమాచారాన్ని చేర్చే ఒక జన్యువు తండ్రిలో లోపించినప్పుడు తల్లి నుండి వచ్చే జన్యుతో లోపం లేకుండా చేస్తుంది.
ఒకవేళ తల్లిలో లోపించినప్పుడు తండ్రి నుండి వచ్చే జన్యువు బిడ్డకి ఎలాంటి లోపం రాకుండా చూస్తుంది అందుకని రక్తసంబంధీకులని పెళ్లి చేసుకోకూడదు. అదే ఒకవేళ రక్తసంబంధీకులు అయితే ఇద్దరు జన్యులోనూ లోపం ఉంటే దాన్ని సరిచేసే అవకాశం ఉండదు ఇలా పుట్టబోయే బిడ్డకి జన్యుపరమైన లోపాలు కలుగుతాయి దీంతో బిడ్డ సమస్యల్ని ఎదుర్కొంటుంది. అలానే పిల్లల్లో హృదయ సమస్యలు, ఐక్యూ తక్కువ ఉండడం, సిస్ట్ ఫార్మ్ అవ్వడం ఇలా ఉంటాయి. ఆటిజం వంటివి కూడా మేనరికం పెళ్లిళ్లలో ఉంటాయి.
Also read:
మీసాల ఆదిపురుష్ తప్పేమి కాదు.. ఇది చూస్తే.. ఔను నిజమే తప్పేముంది అనిపిస్తుంది..!
Adipurush Movie Review: ప్రభాస్ ఆది పురుష్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా వుంది అంటే..?
“వేదం” సినిమా లో కర్పూరం పాత్ర చేసింది ఎవరు..? అనుష్కకు ఏం అవుతారు అంటే..?