Advertisement
Sitara Ghattamaneni Images: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తెగా సితార అందరికి సుపరిచితురాలే. ఆమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. చిన్న వయసులోనే ఆమె హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. బాలనటిగా సితార ఇప్పటివరకు నటించలేదు. అయితే.. త్వరలోనే ఆమె హీరోయిన్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు చూస్తూనే ఉన్నాం. సితార కూడా సినిమాలంటే తనకి ఇంటరెస్ట్ ఉందని తెలిపారు. ఇక, సినిమాల్లో పాటలకి సితార ఓ రేంజ్ లో డాన్స్ లు వేస్తుంటారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చాలా త్వరగా పాపులర్ అయిపోతూ ఉంటాయి.
Advertisement
Sitara Ghattamaneni Images
చిన్న వయసు లోనే యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించిన సితార ఇన్స్టాగ్రామ్ లో కూడా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. తరచుగా ఆమె తనకు సంబంధించిన అన్ని ముచ్చట్లని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సితారకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే అవడంతో ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రమోషన్స్ ద్వారా ఆమె పెద్ద మొత్తం లోనే సంపాదిస్తుంటారట.
Advertisement
ఒక్క ఇన్స్టాగ్రామ్ ద్వారానే సితార నెలకు ముప్పై లక్షల రూపాయలను సంపాదిస్తున్నారట. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. నెలకు ముప్పై లక్షలు అంటే.. స్టార్ సెలెబ్రెటీలకు కూడా ఇది సాధ్యం కాదు. కానీ సితార మాత్రం గట్టిగానే సంపాదిస్తోంది అంటూ మహేష్ బాబు అభిమానులు మురిసిపోతున్నారు.
Read More:
ప్రాణ ప్రతిష్ట శుభ వేళ… ఇంట్లో ఇలా శ్రీరాముడిని ఆరాధించండి..!