Advertisement
తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో తీవ్ర నష్టం కలుగుతోంది. భారీ వర్షాల వలన పంటలు, ఇల్లు ముంపు ప్రాంతాల్లో నీట మునిగాయి. రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది. ఇక వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు అనే విషయాన్ని చూద్దాం. ఏ ప్రాంతంలో అయినా సరే వర్షపాతాన్ని కొలవడానికి రెయిన్ గేజ్ ని ని ఉపయోగిస్తారు. ప్రపంచ దేశాల్లో వాతావరణ శాఖలు వర్షపాతాన్ని కొలవడానికి రెయిన్ గేజ్ లని వాడతారు. వర్షాన్ని రెయిన్ గేజ్ ద్వారా అంగుళాలు లేదా మిల్లీమీటర్లలో కొలుస్తారు.
Advertisement
Advertisement
అనేక రకాల రెయిన్ గేజ్ లు ఉన్నాయి కానీ ఇప్పటికీ పాత వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గాజు సీసా స్తూపాకార ఇనుప పెట్టెలో ఉంచుతారు. తర్వాత సీసా నోటిఫై ఒక గరాటు ఉంచుతారు. గాజు సీసాను బహిరంగ ప్రదేశంలో కానీ సురక్షితంగా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు వర్షపు నీటి చుక్కలు అందులో పడుతుంటాయి. సీసా నీరు సేకరిస్తూనే ఉంటుంది.
Also read:
24 గంటలు వాతావరణం తర్వాత వాతావరణ శాఖ ఉద్యోగులు వచ్చి బాటిల్ లో సేకరించి స్కేల్ సహాయంతో కొలుస్తారు. సంభవించే వర్షపాతం ఈ కొలతలో పదో వంతు గరాటు. వ్యాసం సీసా వ్యాసం కంటే పది రెట్లు పెద్దది. కనుక సీసాలో సేకరించిన నీరు కూడా పది రెట్లు ఎక్కువ. కొన్ని చోట్ల రాడార్ ద్వారా వర్షపాతాన్ని కొలుస్తారు. రేడియో తరంగాలు నీటి బిందువుల ద్వారా ప్రతిబింబిస్తాయి. ఈ ప్రతిబింబం కంప్యూటర్లో తరంగాల రూపంలో కనబడుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!