Advertisement
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీ రామారావు చేసిన సేవలు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలామంది ఆయన నటనకు అభిమానులు అయిపోయారు. ఎన్టీఆర్ నటుడిగా మాత్రమే కాదు ఇతర నటీ నటులను కూడా ఎంతగానో ప్రోత్సహించే వాళ్ళు. ఈయన జీవితంలో ఎన్నో విలువైన విషయాలు అందరికీ చెప్తూ స్ఫూర్తిగా నిలిచారు. కమిడియన్ హీరోగా గుర్తింపు పొందిన రాజేంద్రప్రసాద్ కి ఎన్టీఆర్ కీలక విషయాలని వెల్లడించారు. రాజేంద్రప్రసాద్ నటన మీద ఆసక్తితో మొదట్లో సీరియల్స్ చేసారు. తర్వాత ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు తనని ఒక ఫిలిమ్స్ స్కూల్లో జాయిన్ చేశారు.
Advertisement
అప్పటికి కూడా ఎన్టీఆర్ కి రాజేంద్రప్రసాద్ పై ఎలాంటి నమ్మకం ఉండేది కాదు రాజేంద్ర ప్రసాద్ కి ఫిలిం స్కూల్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దాంతో ఆయనకు నమ్మకం కలిగిందట ఒకరోజు రాజేంద్రప్రసాద్ ని పిలిచి ఎన్టీఆర్ మాట్లాడారు. చూడు ప్రసాద్ ఇప్పుడు నీపై నాకు నమ్మకం కలిగింది. మనం ఇండస్ట్రీలో నిలబడాలంటే మనకంటూ ప్రత్యేకత ఉండాలి అది సంపాదించుకోవాలి అని చెప్పారట.
Advertisement
Also read:
ఎన్టీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీలో మనకంటూ గుర్తింపు రావడం కోసం ఏం చేయాలని ఆలోచించారు రాజేంద్రప్రసాద్. ఆ తరంలో ఇప్పటివరకు అందరూ వివిధ రకాల సినిమాలు చేశారు కానీ కామెడీ హీరోగా ఎవరో నటించలేదని.. అదే ఆయన ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ కారణంగానే రాజేంద్రప్రసాద్ స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!