Advertisement
హైదరాబాద్ ఓ మహా నగరం. ఈ నగరంలో చాలా ఏరియాస్ ఉన్నాయి. వీటికి విచిత్రమైన పేర్లు కూడా ఉన్నాయి. అసలు ఈ పేర్లు ఎందుకు పెట్టారు? ఈ ఏరియాస్ ని ఈ పేర్లతో ఎలా పిలుస్తున్నారు? అనే సందేహాలు చాలా మందికి కలుగుతూనే ఉంటాయి. అయితే.. హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల పేర్ల గురించి మాత్రం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో ఇప్పుడే తెలుసుకోండి.
Advertisement
శంషాబాద్: శంషాబాద్ ఏరియా చాలా ఫేమస్ అయినది. అక్కడ ఎయిర్ పోర్ట్ ఉన్న కారణంగా ఈ ఏరియా దాదాపు అందరికి తెలుసు. కానీ ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు నుంచి శంషాబాద్ వచ్చిందట. ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్‌కి ఉండేది.
బషీర్‌బాగ్: ఈ ఏరియా పేరు బషీర్‌బాగ్ పాలస్ నుంచి వచ్చింది. ఈ పాలస్ ఉండేది కాబట్టే ఆ ఏరియా ని ఈ పేరుతొ పిలుస్తున్నారు. సర్ అస్మాన్ జహ్ బహదూర్ ఈ ప్యాలస్ ను నిర్మించారు. ఈ ప్యాలస్ లో అందమైన తోట ఉండేది. భారత ప్రభుత్వం వచ్చాక ఈ పాలస్ ను కూల్చేశారు. కానీ, పేరు మాత్రం ఉండిపోయింది.
బేగంపేట: బషీరున్నీసా బేగం నిజాం రాజు కుమార్తె. ఆమెను నోబుల్ కి ఇచ్చి పెళ్లి చేసినప్ప్పుడు ఈ ప్రాంతంలోని చాలా భూములను కట్నం కింద ఇచ్చారట. అందుకే ఈ ప్రాంతానికి బేగం పేట అని పేరు వచ్చింది.
సికింద్రాబాద్: సికిందర్ జా (మూడో నిజాం) వలన ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ బ్రిటిష్ సైన్యం ఉండేది. మొదట్లో ఈ మరిన్ని లక్ష్సర్ అని పిలిచేవారట. అంటే కంటోన్మెంట్ అని అర్ధమట.
Advertisement
మాసబ్ ట్యాంక్ : మల్లేపల్లి గ్రామంలో భూముల్ని సాగు చేసుకోవడం కోసం కులీ కుతుబ్ షా VI భార్య హయత్ బక్షి బేగం ఓ నీటి ట్యాంక్ ను నిర్మించారట. మొదట్లో ఈ ట్యాంక్ కు మా సాహెబా కా తలాబ్ అని పిలిచేవారట. అది కాలక్రమంలో మాసబ్ ట్యాంక్ అయిపొయింది.
సుల్తాన్ బజార్: బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నపుడు రెసిడెన్సీ బజార్ ను నిర్మించారు. తిరిగి నిజామ్ అధికారంలోకి వచ్చాక ఈ బజార్ ను సుల్తాన్ బజార్ గా మార్చారు.
నాంపల్లి: క్రీ.శ.1670లో రజా అలీఖాన్ హైదరాబాద్ సంస్థానానికి దివాన్‌గా ఉన్నారు. అతని బిరుదు ‘నేఖ్ నామ్ ఖాన్’ అతనికి జాగీర్ మంజూరు చేయబడింది, నేఖ్-నాంపల్లి, అది ‘నాంపల్లి’గా మారింది.
సోమాజిగూడ: రెవెన్యూ శాఖ ఉద్యోగి పేరు మీద, ఈ గ్రామంలో భూములు కలిగి ఉండి నివాసముంటున్న సోనాజీ పేరు. సోనాజీ సోమాజీ అయ్యాడు మరియు ఆ కుగ్రామానికి ‘సోమాజిగూడ’ అని పేరు వచ్చింది.
మలక్ పేట: అబ్దుల్లా కుతుబ్ షా గోల్కొండ రాజు సేవకుడైన మాలిక్ యాకూబ్ పేరు మీద మలక్ పేటకు పేరు పెట్టారు.
అబిడ్స్: అబిడ్ నిజాం (VI) మహబూబ్ అలీ ఖాన్ యొక్క వాలెట్ మరియు స్టీవార్డ్. అతను ఇక్కడ తన మొదటి దుకాణాన్ని అబిడ్స్ షాప్ అని పిలిచాడు. అలా ఈ ప్రాంతం అబిడ్స్ అయ్యింది.
మరిన్ని..
మా సినిమాని మాకే వదిలావా అంటూ “లియో” సినిమా డైరెక్టర్ లోకేష్ ని ఆడుకుంటున్న నెటిజన్స్..!
Bhagavanth Kesari: “బాలయ్య” సినిమాలో ఆ వ్యాపార వేత్తని ఎందుకు టార్గెట్ చేసారు ???
సుప్రీం తీర్పు ఎలా ఉన్నా జనంలోకి రానున్న టీడీపీ.. పక్క ప్లాన్ సిద్ధం..?