Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అయితే ఒక్కోసారి రకరకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. చాలామంది మెదడు చురుకుగా పనిచేయాలని జ్ఞాపక శక్తి పెరగాలని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. నిజానికి జ్ఞాపకశక్తి పెరగాలన్న మెదడు చురుకుగా పనిచేయాలన్నా ఈ పనులు చేయడం చాలా ముఖ్యం. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మెదడుకి కూడా వ్యాయామం అంతే అవసరం. మెదడును పదును పెట్టడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచించారు.
Advertisement
కొత్త భాష నేర్చుకోవడం వలన మెదడుకు పదును పెట్టినట్లు అవుతుంది దీని వలన మెదడు పని తీరు మెరుగుపడుతుంది పిల్లలకు కూడా కొత్త భాషను నేర్పిస్తే మెదడు పదునెక్కుతుంది. మెదడు పనితీరు బాగుంటుంది. అలాగే మెదడుకి పదును పెట్టాలంటే లెక్కలు చేయడం మంచిది. రోజువారి ఎదురయ్యే లెక్కలు చేయాల్సినప్పుడల్లా మెదడుకు పదును పెట్టినట్లు అవుతుంది. అలానే పుస్తకాలు చదవడం వలన కూడా మెదడు పదునుగా మారుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
Advertisement
Also read:
పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవడం చాలా మంచి లక్షణం. చేయి చూపు కలిపి చేసే పనులు చేస్తే కూడా మెదడు పదునెక్కుతుంది. ఉదాహరణకు రాయడం, వీడియో గేమ్స్, బొమ్మలు, పెయింటింగ్ ఇటువంటివి. మెదడు పదునుగా మారాలంటే ఏదైనా ఆహారం తినేటప్పుడు అందులో ఏ పదార్థాలు వేసారో గెస్ చేయడం ఇటువంటివి చేయడం వలన కూడా మెదడు ఆలోచన శక్తి పెరుగుతుంది. మెదడు పదును ఎక్కుతుంది. మంచి నిద్ర కూడా మెదడు పనితీరుకి ఉపయోగపడుతుంది. కాసేపు ధ్యానం చేయడం వలన కూడా ఆ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇలా శారీరిక ఆరోగ్య మానసిక ఆరోగ్యం రెండు మెరుగుపడతాయి.
ఆరోగ్య చిట్కాలు కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!