Advertisement
గర్భధారణ, మహిళలు అత్యంత సంతోషంగా ఫీల్ అయ్యే క్షణాలు. దీనికోసం తాము గర్భం ధరించామో లేదో తెలుసుకొనుటకు సమయం కోసం ఎదురు చూడడమో లేక, గర్భధారణ నివృత్తి పరికరాలను వినియోగించడం చేస్తుంటారు. కానీ వీటి అవసరం లేకుండానే ఇంటిలో కొన్ని సహజ పద్ధతులు అవలంబించుట ద్వారా గర్భధారణ గురించిన సందేహాలు తొలగించుకోవచ్చు. సాధారణంగా శాస్త్రీయ పద్ధతుల ద్వారా డాక్టరు పర్యవేక్షణలో తెలుసుకోవడమే ఉత్తమ మార్గం. కాగా అయితే, పూర్వం కొన్ని పద్ధతుల ద్వారా గర్భధారణ పరీక్షలు చేసుకునేవారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ALSO READ : పాండ్యా బ్రదర్స్ కు మరో బ్రదర్ ఉన్నాడు తెలుసా ?
ఉల్లిపాయ పరీక్ష:
గ్రీకుల పద్ధతిలో, మర్మావయవాలా వద్ద ఉల్లిపాయ ఉంచి మర్నాడు నోటి నుండి, ఆ వాసన వస్తే గర్భిణీ అనేవారు. లోపల పిండం వల్ల, మొత్తం జీర్ణనాలం, పూర్తిగా తెరుచుకొని ఒక గొట్టంల పనిచేస్తుంది అని అనేవారు.
తాళం పద్ధతి:
15వ శతాబ్దంలో పరీక్ష చేయవలసిన వ్యక్తి మూత్రం ఉన్న, ఒక గిన్నెలో తాళం వేస్తే మర్నాటికి కింద ఆ తాళపు అచ్చు ఉందంటే, గర్భధారణ సూచనగా భావించేవారు. ఇది కూడా అర్థంలేని ఆలోచనే.
Advertisement
మూత్ర ప్రవీణులు:
వీరు 16వ శతాబ్దిలో యూరప్ లో ఉండేవారట. మూత్రం రంగు, లక్షణాలు చూసి పుట్టబోయే బిడ్డ, ఆడో, మగో చెప్పేసేవారట. కొందరు మూత్రాన్ని ద్రాక్ష రసంలో వేసి, అది పారదర్శకత కోల్పోతే, గర్భిణీ అని తలచేవారట.
కంటి రంగు:
గర్భం దాల్చిన వారికి, రెండో నెలలోపు, కంటిలో జరిగే మార్పులు గమనించి, ఫలితం చెప్పగల నేర్పు ఆనాటి వైద్యులకు ఉండేది. ఇలా అన్నది 16వ శతాబ్ది వైద్యుడు జాక్ గిల్మవు. గర్భధారణ సమయంలో కంటిలో మార్పులు, కొందరిలో సహజమే అని నేటి పరిశోధనలు చెబుతున్నాయి కూడా.
చాడ్విక్ చిహ్నం:
మర్మావయల వద్ద, ఎక్కువ రక్త ప్రసరణ వల్ల, రంగు పెరుగుతుందని, 1836లో ఫ్రెంచి వైద్యుడైన జేమ్స్ చాడ్విక్, కనుగొన్నాడు. అయితే ఇది అందరికీ, అన్నిసార్లు వీలు పడే పరీక్ష కాదు. ఆ కాలంలో ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా అరుదుగా చేసేవారు.
also read: అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు !