Advertisement
మనందరికీ కలకత్తాలోని హౌరా బ్రిడ్జి చాలా ఫేమస్ అని తెలుసు. కానీ దాని నిర్మాణం వెనుక ఉన్న అసలు రహస్యం మనకు తెలియదు. మరి అది ఏంటో ఒకసారి తెలుసుకుందాం..? ఒకప్పుడు హుగ్లీ నది పైన ఎలాంటి బ్రిడ్జి ఉండేది కాదు.పడవల సహాయంతో నదిని దాటే వారు. దీంతో కలకత్తా మరియు బెంగాల్ ప్రభుత్వం హుగ్లీ నదిపైన బ్రిడ్జి కట్టాలని ప్రతిపాదించింది. వెంటనే ఒక సివిల్ ఇంజనీర్ కు బాధ్యతలను అప్పగించారు. 22 లక్షల వ్యయంతో 1500 ఫిట్ల పొడవుతో 62 ఫీట్ల వెడల్పు గల బ్రిడ్జి నిర్మించారు. 1906లో హౌరా రైల్వే స్టేషన్ కట్టిన తర్వాత రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో కొత్త బ్రిడ్జి పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో అందులో మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో కొత్త నిర్మాణాలు చేయలేకపోయారు.
Advertisement
1922లో హౌరా బ్రిడ్జ్ కమిషన్ స్థాపించి కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త బ్రిడ్జి కోసం టెండర్లను ఆహ్వానించారు. జర్మనీకి చెందిన ఒక సంస్థ తక్కువ డబ్బులకు ఓకే చెప్పి టెండర్ ను దక్కించుకుంది. అప్పటికే బ్రిటన్ మరియు జర్మనీ మధ్య సంబంధాలు తెగిపోవడంతో బ్రిడ్జి పనులు వేరే కంపెనీకి అప్పజెప్పింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 26500 టన్నుల స్టీల్, అవసరమని అంచనా వేశారు. ఆ సమయంలో ఇంత పెద్ద స్టిల్ ను పోగు చేయడం చాలా కష్టమైన పని. బ్రిడ్జి ఎలాగైనా కట్టాలి కాబట్టి దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా స్టీల్ కంపెనీ దీనికి ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపుగా ఇరవై మూడు వేల ఐదు వందల టన్నుల స్టీల్ టాటా కంపెనీ సప్లై చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది టాటా బ్రిడ్జి.
Advertisement
దీని తర్వాత హౌరా బ్రిడ్జ్ డిజైన్లు తయారు చేశారు. బ్రిటిష్ వారు ఒక విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎలాగయినా సరే బ్రిడ్జి మధ్యలో మాత్రం ఎలాంటి పిల్లర్స్ ఉండకూడదు. ఎందుకంటే బ్రిడ్జి నుంచి వచ్చి పోయే నౌకలకు అంతరాయం కలుగుతుందని. బ్రిడ్జి నిర్మాణాన్ని కేవలం 4 పిల్లర్స్ తోనే డిజైన్ చేసారు. ఈ పిల్లర్స్ మధ్య దూరం 1500 అడుగులు. బ్రిడ్జి వచ్చేసి 250 అడుగుల ఎత్తులో ఉంది. నదిలో ఒక పిల్లర్ లేకుండా ఈ బ్రిడ్జి నిర్మాణం చేశారు. దాదాపు వంద సంవత్సరాల నుంచి చెక్కుచెదరకుండా ఉంది అంటే చాలా ఆశ్చర్యం గొలిపే విషయం. బ్రిడ్జి నిర్మాణంలో నట్టు, బోల్ట్ ఉపయోగించకుండా చేతితో తయారు చేసిన కొన్నింటి తో పూర్తి చేశారు. మొత్తానికి బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది అప్పటికి ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద బ్రిడ్జి గా పేరుగాంచింది.
also read;
భారతీయ రైల్వేలో ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ కోచ్ లు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా..?