Advertisement
భార్యాభర్తలు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. పెళ్లి తర్వాత ఒకరి అభిప్రాయాలని ఒకరు గౌరవించడం, ఒకరినొకరు ఇష్టపడడం, ఒకరి భావాలని మరొకరితో పంచుకోవడం, ఇటువంటివన్నీ కూడా చాలా ముఖ్యము. భర్త ఏ తప్పు చేసినా భార్య క్షమించాలి. భార్య ఏ తప్పు చేసిన భర్త క్షమించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే చక్కగా వైవాహిక జీవితం సాగుతుంది లేదంటే లేనిపోని గొడవలు వంటివి కలుగుతూ ఉంటాయి. అయితే ఈ తప్పు చేస్తే మాత్రం భర్తని ఏ భార్య కూడా క్షమించదు. కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
Advertisement
భర్త తప్పు చేసినప్పుడు భార్య క్షమించడం, భార్య తప్పు చేసినప్పుడు భర్తను క్షమించడం వలన బంధం బాగుంటుంది. కానీ పదే పదే తప్పులు చేస్తూ ఉంటే బంధానికి అది భారం అవుతుంది. భర్త కొన్ని తప్పులు చేస్తే భార్య క్షమించదు. ఇది వాళ్ళ హృదయాన్ని బ్రేక్ చేస్తుంది భర్త ఏం చేసినా భార్య భరిస్తుంది కానీ ఇంట్లో కుటుంబీకులు ముందు స్నేహితుల ముందు అవమానిస్తే అస్సలు భర్త ని భార్య క్షమించదు ఇలా చేస్తే భర్తకి భార్య నుండి ప్రేమ గౌరవం లభించవు.
Advertisement
అలానే భర్త ఇంకొక స్త్రీతో సంబంధాన్ని పెట్టుకుంటే కూడా దానిని అసలు భార్య తట్టుకోలేదు. తనని కొట్టిన తిట్టిన భరిస్తుంది కానీ ఇటువంటి తప్పు చేస్తే మాత్రం అసలు ఆ స్త్రీ తట్టుకోలేదు. కాబట్టి పొరపాటున కూడా భర్త ఈ తప్పులు చేయకూడదు. అలానే భర్త అందరి ముందు చెయ్యి ఎత్తితే కూడా భార్య తట్టుకోలేదు. ఇది ఆమె ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. అగౌరపరిచినట్లు అవుతుంది. సో ఈ తప్పు చేస్తే కూడా భార్య అసలు క్షమించదు అవసరమైనప్పుడు అండగా నిలబడ లేనప్పుడు కూడా భర్తని క్షమించదు ఆ భార్య. ఎప్పుడూ కూడా ఈ తప్పులు చేయకండి అనవసరంగా రిలేషన్ ని పాడు చేసుకోకండి భార్య అసలు క్షమించలేదు అని గుర్తు పెట్టుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!