Ads
ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు అసలు మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండడం లేదు. దాదాపుగా ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. దాంతో కలిసి మాట్లాడుకునే సమయం కూడా దొరకడం లేదు. అయితే ఇద్దరు బిజీగా ఉండటం మాట్లాడుకోవడానికి సమయం కూడా ఉండకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. అయితే ముందుగా ఉన్న మీ భార్యని ఈ సింపుల్ లాజిక్ తో మీ భార్యని ఇలా దారిలోకి తెచ్చుకోండి.
READ ALSO : AKKINENI AKHIL AGENT REVIEW IN TELUGU: అక్కినేని అఖిల్ “ఏజెంట్” మొదటి రివ్యూ.. ఈసారి హిట్ కొట్టినట్టేనా..?
తన తల్లిదండ్రులను, తోబుట్టులను, స్నేహితులను, బంధువులను అందరినీ విడిచి వివాహం చేసుకున్న భర్తపై నమ్మకంతో అత్తవారింటికి అడుగుపెడుతుంది. భర్త, భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ, భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలుగా, మంత్రిగా వీటన్నింటికీ మించి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది. అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికిమాటికి ఖయ్యానికి కాలు దువ్వరాదు.
Advertisement
భార్య వడ్డించిన పదార్థాలను తినకుండా విమర్శించరాదు. ఇంటిని భార్య జైలులా భావించే పరిస్థితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బయటికి తీసుకెళ్లాలి. పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి. పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు. ఏక గదిలో కాపురం ఉంటున్న వారు పిల్లలని గమనించి కలవాలి. భార్యకు ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి. ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. భార్యను పరుల ముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు. భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గానీ అవమానించే వ్యక్తిగా చూడకూడదు.
READ ALSO : మల్లేశ్వరి సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా మారిపోయిందంటే ?