Advertisement
ఆమ్రపాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐఏఎస్ అధికారులులో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకోవడం జరిగింది. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా మూడేళ్ల పాటు ఈమె పని చేశారు ఆమె అక్కడ పని చేసిన టైం లో బాగా హైలెట్ గా నిలిచారు ఈమెకి ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈమె ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.
Advertisement
వరంగల్ లో పని చేశాక పీఎంఓ కి బదిలీ వెళ్లారు. తాజాగా ఈమె తెలంగాణ కి తిరిగి వచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమె ని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా పెట్టింది కమిషనర్ గా నియమితులైన తర్వాత నెటిజెన్స్ ఆమెకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఆమెకి సంబంధించిన వివరాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. 1982 నవంబర్ 4న ఈమె పుట్టారు.
Advertisement

Amrapali ias Love Story
ఐఐటి మద్రాస్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ని పూర్తి చేస్తారు. తర్వాత బెంగళూరు ఐఎంఎం నుండి పీజీ డిప్లొమా చేశారు. 2010లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఈమెకి ఆల్ ఇండియా 39వ ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ కి ఎంపికైన అతి చిన్న వయసు వాళ్ళల్లో ఒకరిగా ఈమె నిలిచారు. 2011 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సమీర్ శర్మ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 18న వీళ్ళ పెళ్లి అయింది. తక్కువ మంది కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షం లో వీళ్ళ పెళ్లి అయింది. సమీర్ 2011లో ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యారు. ఈమె తెలుగు అమ్మాయి సమీర్ చూస్తే ఉత్తరాది కి చెందిన అతను.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!




