Advertisement
న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే ఎప్పటి నుండో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లాబుషెన్ మొదటి ర్యాంక్ నుండి ఐదవ స్థానానికి పడిపోయాడు. అలానే ఇక మన ఇండియా ప్లేయర్స్ విషయానికి వస్తే.. వీటిల్లో రిషబ్ పంత్ పేరు మాత్రమే ఉంది. రిషబ్ పంత్ 758 రేటింగ్ పాయింట్లతో వున్నాడు.
Advertisement

Advertisement
855 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఉండగా ఐదవ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లాబుషెన్ మొదటి ర్యాంక్ నుండి ఐదవ స్థానానికి పడిపోయాడు. ఆ తరవాత స్థానాల్లో ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, కంగారూ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వున్నారు. ఆ తరవాత న్యూజిలాండ్‌కు చెందిన డారీ మిచెల్ వున్నారు. వీళ్ళ పాయింట్లయితే వరుసగా 849, 842, 824, 792 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే తొమ్మిదో స్థానంలో ఉండగా భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ టెన్త్ లో వున్నాడు.
Also read:




