Advertisement
కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1982లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాధవి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ చిత్రాన్ని ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై కే రాఘవ నిర్మించారు. దర్శకుడిగా కోడి రామకృష్ణకు, నటుడిగా గొల్లపూడి మారుతీ రావు కి ఇది తొలి చిత్రం. 1982 ఏప్రిల్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఏకంగా 512 రోజులు ఆడింది. చిరంజీవి కెరీర్ కి ఈ చిత్రం మరో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
Advertisement
ఈ చిత్రంలో చిరంజీవి ఇమేజ్ ని భిన్నంగా చూపించడమే కాదు.. కేవలం 29 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని యావరేజ్ టాక్ తో జర్నీ మొదలుపెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం 3 లక్షల 25 వేల రూపాయలతో ఈ సినిమా షూటింగ్ ని పాలకొల్లు, నరసాపురం, సఖినేటిపల్లి, పోడూరు, భీమవరం, మద్రాస్ లలో జరిపారు. సినిమా పనులు పూర్తయ్యాక సెన్సార్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న రాఘవ పట్టుదలతో పోరాడి సెన్సార్ ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఇక చిత్రం విడుదలయ్యాక ఎనిమిది కేంద్రాలలో 50 రోజులు, రెండు కేంద్రాలలో వంద రోజులు ఆడి మంచి కలెక్షన్స్ రాబట్టింది.
Advertisement
హైదరాబాద్ సిటీలో ఈ సినిమా ఏకంగా 512వ రోజు వరకు ఆడిందంటే అతిశయోక్తి కాదు. ఇంట్లో భార్యపై ప్రేమని చూపిస్తూనే.. ఇంటి బయట అడుగుపెట్టగానే మరో స్త్రీ కోసం వెంపర్లాడి మగాడి జీవితాన్ని ఈ మూవీ ఆవిష్కరిస్తుంది. ఈ చిత్రంతో చిరంజీవి యాక్షన్ హీరో గానే కాకుండా ఫ్యామిలీ హీరోగా కూడా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ప్రస్తుత కాలంలో చిన్న సినిమాలను షూటింగ్ చేయాలన్న చాలా సమయం తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే ఏకంగా ఏడాది, రెండేళ్ల సమయం షూటింగ్ జరుపుకుంటున్నాయి. కానీ ఈ సినిమా కేవలం 29 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిందంటే అతిశయోక్తి కాదు.
Read also: మరో కొత్త వివాదానికి తెరలేపిన బాలకృష్ణ.. ఈసారి టార్గెట్ అక్కినేని నాగార్జున?