Advertisement
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఇంటిని బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. దాంతో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ప్రస్తుతం అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వలన ఆఫీస్ నుండి వచ్చాక ఇంట్లో పనితో బిజీ అవుతున్నారు. దీంతో ఒకరితో ఒకరు మాట్లాడడానికి కూడా సమయం ఉండడం లేదు దానివలన రిలేషన్ పై ప్రభావం ఉంటుంది.
Advertisement
కనుక భార్య భర్తలు బంధం బాగుండాలి అంటే ఎంత బిజీ ఉన్నా సరే కొంత సమయాన్ని కేటాయించాలి. మొబైల్ కు దూరంగా ఉండటం చాలా అవసరం. ఆఫీస్ అయిపోయాక ఫ్రీ టైం దొరికితే మొబైల్ వాడడం సహజమే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ కు బదులుగా మీ పార్ట్నర్ తో సమయాన్ని కేటాయించండి. సమయం ఉన్నా లేకపోయినా వీలు చూసుకుని వెకేషన్ కి వెళ్ళండి. ఇలా చేయడం వలన కొంత సమయాన్ని కేటాయించుతారు, ఎంతో ఆనందంగా ఉంటారు.
Advertisement
Also read:
ఎప్పుడైతే ఇంట్లో ఇద్దరూ పని చేస్తారో అప్పుడు సగం గొడవలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఆఫీస్ అయిన తర్వాత ఇంట్లో పని కూడా పూర్తి చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఏ పని చేసినా షేర్ చేసుకుంటే మేలు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాన్ని చేస్తుంటే ఇద్దరు ఒకే సమయానికి లేచి లేవడం మరియు పడుకోవడం చేయాలి అంతేకాక పడుకునే ముందు మొబైల్ కు దూరంగా ఉండి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఇలా చేయడం వల్ల బంధం ఎంతో బలపడుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!