Advertisement
సాధారణంగా ఎవరు అయినా ఏ సమాచారం కోసం అయినా గూగుల్ మ్యాప్ నమ్ముకుంటారు. గూగుల్ మ్యాప్ మీద నమ్మకంతో ఓ లారీ డ్రైవర్ వెళ్లాడు. అతనికి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్ మ్యాప్ రోడ్డు కనిపిస్తుంది. కానీ కళ్ల ముందు పెద్ద ప్రమాదం కనిపించింది. తమిళనాడు నుంచి చేర్యాల మీదుగా హుస్నాబాద్ కి ఓ లారీ డ్రైవర్ లోడ్ తో బయలుదేరాడు. లారీలో డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్య ఉన్నారు.
Advertisement
చీకటిలో వారు వెళ్లే రూట్ అర్థంకాక తికమక పడ్డారు. దీంతో ఫోన్ లో గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నారు. వారికి రూట్ చూపించడంలో గూగుల్ వారిని తప్పుదోవ పట్టించి ప్రమాదంలో పడేసింది. సిద్దిపేట జిల్లా గౌరవెల్లి రిజర్వాయర్ చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటే అక్కన్నపేట గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ నీళ్లలోకి సరాసరి చేర్చింది. దీంతో లారీ నీటిలో కూరుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీళ్లు రోడ్లపై నిలిచిపోయాయని ఇద్దరూ భావించారు.
Advertisement
వారు ముందుకు వెళ్లే కొద్ది నీళ్లలోతు పెరిగిపోతుండటంతో ఎందుకో అనుమానం వచ్చి లారీని నిలిపేశారు. కొద్ది సేపటికే లారీ క్యాబిన్ వరకు నీళ్లు చేరుకున్నాయి. ఎక్కడో తప్పు జరిగిందని గ్రహించిన వారిద్దరూ మెల్లగా కిందికి దిగి గ్రామ సమీపంలోని స్థానికుల వద్దకు వెళ్లారు. సమీపంలోని రామవరం గ్రామస్థులకు సమాచారం అందించారు. స్థానికులు లారీకి తాళ్లు కట్టి అతి కష్టం మీద రోడ్డు మీదికీ తీసుకొచ్చారు. నందారం స్టేజీ వద్ద స్టాపర్లను ఏర్పాటు చేసి బైపాస్ రోడ్డు మీదుగా లారీని అక్కడి నుంచి మళ్లించడంతో ప్రమాదం తప్పింది. లేదంటే అదే రోడ్డు అనుకొని వెళ్లితే..మృత్యువుని వెతుక్కుంటూ సరాసరి నదిలోకి వెళ్లిపోయేవారు.