Advertisement
ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని చాలామంది ఆచరిస్తుంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎటువంటి మార్గంలో పయనించాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, తదితర విషయాలపై చాణక్య నీతి శాస్త్రంలో సవివరంగా వివరించారు. వీటిని పాటిస్తే తప్పకుండా జీవితంలో విజయాన్ని సాధించవచ్చు అని చెప్పారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడానికి వచ్చే కొన్ని సంకేతాల గురించి చాణక్య ప్రస్తావించారు. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
తులసి మొక్క ఎండిపోవడం:
తులసిని దైవంగా పరిగణిస్తారని, దీనిని ప్రతి రోజు ఇంట్లో పూజిస్తారని చాణక్యుడు చెప్పారు. మీ ఇంట్లో ఉన్న తులసి అకస్మాత్తుగా ఎండి పోతే, ఇలా జరగడం ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయనడానికి సంకేతం. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.
Advertisement
ఇంట్లో కలతలు:
ఏ కుటుంబంలో కలతలు, కష్టాలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని చెబుతారు. లక్ష్మీ నివసించాలంటే, ఆ ఇంట్లో ప్రేమగా జీవించడం, పెద్దలను గౌరవించడం, ఇంటి కోడలును గౌరవించడం నేర్చుకోవాలి. ఇంటి కోడలు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.
ఇంట్లో గొడవలు:
ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఇంట్లో గొడవలు చెడుకు సంకేతం. గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదట. ఇది ఆర్థిక పరిస్థితి పైన ప్రభావం చూపిస్తుంది.
అద్దం పగలడం:
ఇంట్లో అద్దం పగిలితే అశుభంగా భావిస్తాం. పదేపదే గాజు వస్తువులు పగిలిపోతే ఆ ఇంటిని ఆర్థిక సమస్యలు చుట్టూ ముడతాయని అర్థం.
Read also : “గాడ్ ఫాదర్” మూవీ సక్సెస్ సాధించినట్టే…సెన్సార్ టాక్ !