Advertisement
సాధారణంగా మన భారతదేశంలో జ్యోతిష్యాన్ని మరియు వాస్తు ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. వాస్తు నియమాల ప్రకారమే ఇంటి నిర్మాణాలు వ్యాపార నిర్మాణాలు చేస్తూ ఉంటాం. వాస్తు ప్రకారమే ఏ పనైనా మొదలు పెడతాం. అలా ఇంట్లో వ్యాపారంలో వాస్తు బాగుంటేనే మనకు అన్ని లాభాలు ఉంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు. కొందరు ఇండ్లలో తరచూ సమస్యలు వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి నియమాలు పాటిస్తే కచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అంటున్నారు.. ఈసారి శుభకృతి నామ సంవత్సరం వస్తోంది. ఉగాది మార్చి 22 తేదీన వస్తోంది.
Also Read:Weekly Horoscope Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 19.03.2023 నుంచి 25.03.2023 వరకు
ఉగాది అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటిని వారం రోజులు ముందే శుభ్రంగా ఉంచుకుంటారు. పండగకి ఇంటిని ఎంతో అందంగా అలంకరిస్తారు. కావలసిన సామాన్లు తెచ్చుకోవడం. పండగనాడు అందంగా ముగ్గులతో రంగులు వేయడం. ఇంట్లో చెత్తాచెదారాలను తొలగించడం ఇలా ఒకటి కాదు ఎన్నో పనులు చేస్తారు. కానీ ఈ ఉగాదికి ముందే మీ ఇంట్లో ఈ వస్తువులను తొలగించండి లేదంటే సమస్యలు తప్పవు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే దేవతల విగ్రహాలు పగిలిపోయి ఉంటే తొలగించండి.
Advertisement
Also Read: పొత్తులపై జగన్ సంచలన వ్యాఖ్యలు
అలాంటి వాటిని పూజ మందిరంలో పెట్టి పూజ చేయడం మంచిది కాదు. ఇది మనకు నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అలాంటి విగ్రహాలను నీళ్లలో వేయడం మంచిది. అంతేకాకుండా ఆగిపోయిన గడియారాలు పనిచేయని గడియారాలు ఇంట్లో ఉంచకూడదు. ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. అంతేకాదు పగిన గాజు సామాన్లు వంటివి ఇంట్లో ఉంచకూడదు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తాయట. అలాగే ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇళ్లలో వదిలేస్తూ ఉంటారు. ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయట. కాబట్టి ఈ ఉగాదికి ముందు వీటన్నింటినీ తొలగించి ఈ కొత్త ఏడాది తర్వాత మీరు ఆనందంగా జీవించండి.
Advertisement
Also Read:వైసీపీ గాలికి కొట్టుకొచ్చిందట!