• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Weekly Horoscope Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 19.03.2023 నుంచి 25.03.2023 వరకు

Weekly Horoscope Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 19.03.2023 నుంచి 25.03.2023 వరకు

Published on March 19, 2023 by karthik

Advertisement

Weekly Horoscope in Telugu 2023: ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఈ వారం రాశి ఫలాలు చూసుకుంటున్నారు. అయితే, ఈ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తులకు ప్రతి రోజూ ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తును అంచనా వేయగలరు. ఇలా మేషం నుంచి మీనం వరకు.. 19-03-2023 నుంచి 25-03-2023 ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.

 

మేషం :- రాజకీయ నాయకులకు మెళుకువ అవసరం. బంధు మిత్రులతో పట్టింపులొస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు, పథకాలు రూపొందిస్తారు. మీ పెద్దల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో కుటుంబీకులతో ఏకీభావంకుదరదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం.

Read also: మరో కొత్త వివాదానికి తెరలేపిన బాలకృష్ణ.. ఈసారి టార్గెట్ అక్కినేని నాగార్జున?

Today Horoscope in Telugu 2022

Today Horoscope in Telugu 2022

వృషభం :- ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. రావలసిన మొండి బాకీలు సైతం వాయిదాపడతాయి. మీ సంతానం విపరీత ధోరణి వల్ల కించిత్ ఆందోళన చెందుతారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు.

మిథునం :- ప్రభుత్వ కార్యాలయంలో పనులు సకాలంలో పూర్తికావు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అతి కష్టం మీద ఫలిస్తాయి. నిరుద్యోగులకు వచ్చిన అవశాన్ని జారవిడుచుకోవటం మంచిదికాదు.

కర్కాటకం :- స్థిరాస్తిని అమర్చుకుంటారు. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. హోటల్, నిరుద్యోగులు పోటీ పరీక్షలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందుతారు. కిరణా, ఫ్యాన్సీ ముఖ్యుల ఆదరణ కోసం ప్రయత్నిస్తారు. ధనం సమయానికి అందడం వల్ల మానసిక కుదుటపడతారు.


సింహం :- మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. బంధు మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. గణిత, సైన్సు, కామర్స్ రంగాల వారికి గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు.

కన్య :- వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలు తలెత్తుతాయి. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతోముఖ్యం. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి. ఎవరికైనాధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.

Advertisement

తుల :- వ్యాపారంలో కొంతమంది తప్పుత్రోవ పట్టించవచ్చు జాగ్రత్త వహిచండి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. రుణ విముక్తులు కావటంతో మనస్సు తేలికపడుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Also Read: సమంత దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన 10 వస్తువులు


వృశ్చికం :- ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి. రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలల ఏకాగ్రతవహించండి.

ధనస్సు :- బంధువులు మీ స్తోమతకు తగిన వివాహ సమాచారం అందిస్తారు. మిత్రుల సలహాపాటించి లబ్ధి పొందుతారు. సహనంతో వ్యవహరిస్తే అన్ని విషయాల్లోనూ జయం మీదే. స్త్రీలు అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. ఆరోగ్య, విషయాల్లో అధికమైన జాగ్రత్త అవసరం.

మకరం :- మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ముఖ్యుల రాక మీకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు షాపింగులోను, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.

కుంభం :- ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకింగ్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. మీరు చేపట్టిన పనిలో కొన్ని ఆటంకాలను ఎదుర్కుంటారు. ముఖ్యుల మధ్య ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.

మీనం :- శారీరక శ్రమ వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. వృత్తి వ్యాపారులు సజావుగా సాగుతాయి. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విద్యార్ధినులకు టెక్నికల్, కామర్స్, కంప్యూటర్ విద్యలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరుగుతాయి.

Advertisement

Read also: వివాహాలకు వెళ్ళినప్పుడు ప్రతి యువకుడికి, యువతికి అడిగే ప్రశ్న !

Latest Posts

  • కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ!
  • కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి
  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd