Advertisement
వినాయక చవితికి సంబంధించిన వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీ హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి పండుగను ఇంటింట్లో, వాడవాడలా వైభవంగా జరుపుకుంటారు. వినాయక చివితి పండుగను జరుపుకునే వారు గణనాథుని విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. గణేష్ చతుర్థి కి సంబంధించి వాస్తు నియమాలను తప్పకుండా ఈ సమయంలో పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటికి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలని ఆలోచించే వారు ముందుగా వాస్తు సూత్రాలను గురించి తప్పక తెలుసుకోవాలి.
Advertisement
Advertisement
వాస్తు నియమాల ప్రకారం.. విగ్రహాన్ని ప్రతిష్టించాలి. అప్పుడే గణేశుడి ఆశీస్సులు మీపై పూర్తిగా ఉంటాయి. ఇంటికి గణేశుడు విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు విగ్రహాన్ని ఎన్నుకునేటప్పుడు వినాయకుడి తొండం యొక్క భంగిమ దిశను గుర్తుంచుకోవాలి. వినాయకుడి తొండం ఎడమ వైపునకు వంగి ఉంటే అది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఇంట్లో సంతోషం, సంపదలు వెల్లువిరుస్తాయి. కుటుంబ సభ్యులకు ప్రశాంత జీవనం లభిస్తుంది.
వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు దాని రంగును కూడా గమనంలో ఉంచుకోవాలి. ఎరుపు రంగు వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టించడం వల్ల కుటుంబ సభ్యులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంట్లోని వారికి ఆనందం ఉంటుంది. వాస్తు ప్రకారం.. ఇంటికి గణేశుడు విగ్రహాన్ని తీసుకొచ్చిన తరువాత ఉత్తరం దిశవైపు ప్రతిష్టించాలి. ఈ దిశను లక్ష్మీదేవి, శివుడికి అంకితం చేసినట్టు చెబుతారు. లక్ష్మీ, శివుడు ఈ దిశలో నివసిస్తున్నారని సూచిస్తుంది. గణేశుడి ముఖాన్ని ఈ దిశలో ఉంచితే మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని పేర్కొంటున్నారు నిపునులు.