Advertisement
సాధారణంగా భార్య, భర్తలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం. ఆ గొడవలు ప్రతీ కుటుంబంలో వస్తుంటాయి. కానీ వాటిని సర్దుకుపోతే ఏ సమస్య రాదు. కానీ చిన్న సమస్యను పెద్దగా చేస్తే.. మాత్రం విడాకులు, ఇతర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కొంత మంది తొలుత ప్రేమించుకుంటారు. తల్లిదండ్రులకు వీరి పెళ్లి ఇష్టంలేకపోయినా ఇద్దరే రహస్యంగా పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత వీరికి సమస్యలు మొదలై ఏకంగా విడాకుల వరకు వెళ్తుంటారు. రకరకాల సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Advertisement
అతనిది గాజువాక, ఆమెది అగనం పూడి. వీరు ఒకరికొకరూ ఇష్టపడ్డారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ముచ్చటగా మూడు నెలలు కూడా కాకముందే అత్తింటి వారి నుంచి కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయి. చిరాకు చెందిన భార్య విడాకులు కోరింది. దీంతో భర్త పగబట్టాడు.
గత నెల 29న అచ్యుతాపురం లాడ్జీలో మహాలక్ష్మీ అనే వివాహిత మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు తండ్రి సాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్సీ మీడియాకి వివరాలను వెల్లడించారు.
గాజువాక బీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్.. అగనంపూడిలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సాంబ కుమార్తె మహాలక్ష్మిని మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరు ప్రేమ వివాహం చేసుకోవడంతో మూడు నెలల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది.
Advertisement
ఎస్టీ కి చెందిన మహాలక్ష్మీకి వంటలు రావని, కట్నం తేలేదని భర్త శ్రీనివాస్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా వేధించడం మొదలుపెట్టారు. దీనిని భరింలేక మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. రాంబిల్లి మండలంలోని రైతు భరోసా కేంద్రంలో పని చేస్తున్న మహాలక్ష్మిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇతని వేధింపులు తట్టుకోలేక దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తమకు విడాకులు కావాలని కోరడంతో.. ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోవాలని సూచించారు పోలీసులు. దీంతో మహాలక్ష్మిపై పగ పెంచుకొని శ్రీనివాస్ ఓ లాడ్జీలో రూమ్ తీసుకొని మహాలక్ష్మికి ఫోన్ చేశాడు.
తన మాయమాటలతో మహాలక్ష్మిని లాడ్జీకి రప్పించాడు. అప్పటికే రెండు కత్తులు, మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు సిద్ధం చేసుకొని ఉన్న శ్రీనివాస్ కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో భర్త శ్రీనివాస్ బాత్ రూమ్ లో, మహాలక్మి రక్తపు మడుగులో పడిపోయారు. వెంటనే లాడ్జీ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని డోర్ పగులగొట్టి చూసే వరకు ఇద్దరూ పడిపోయి ఉన్నారు. వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా మహాలక్ష్మీ తిరిగిరాని లోకాలకు వెళ్లింది.
శ్రీనివాస్ రెండు మూడు రోజుల్లో కోలుకున్నాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా తన మాదిరిగానే మహాలక్ష్మి జీవితం కూడా నాశనం కావాలనే కక్షతోనే శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఒప్పుకున్నట్టు వెల్లడించారు డీఎస్పీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
క్రికెటర్ శ్రీశాంత్ భార్య బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!