Advertisement
టాలీవుడ్ నటుడు వడ్డే నవీన్ గురించి ఇప్పటి సినీ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ రెండు దశాబ్దాల కిందట వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో వడ్డే నవీన్ ఒకరు. ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ సమయంలోనే వడ్డే నవీన్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తొలుత హీరోగా విజయాలు అందుకున్న నవీన్ కు ఒక దశలో వరుసగా ఫ్లాప్ లు పలకరించాయి. దీంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు.
Advertisement
కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వడ్డే నవీన్. ఈయన ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్ హీరోగా, మహేశ్వరి హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి చిత్రం అతని సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తరువాత చాలా బాగుంది, ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు, మా బాలాజీ వంటి సినిమాలు నవీన్ కు మంచి గుర్తింపు సంపాదించాయి.అయితే వడ్డే నవీన్ వ్యక్తిగత విషయాల గురించి మాత్రం చాలామందికి తెలియదనే చెప్పాలి.
Advertisement
సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయినే వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురు అయినటువంటి చాముండేశ్వరిని వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వడ్డే నవీన్, చాముండేశ్వరి విడిపోయారు.అయితే వ్యక్తిగత సమస్యల వల్లే నవీన్ కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డాడని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఆ తర్వాత వడ్డే నవీన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నవీన్ చివరిగా నాలుగేళ్ల కిందట మనోజ్ హీరోగా నటించిన ఎటాక్ సినిమాలో నటించారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పక్కింటి వాళ్లు తిట్టినా.. భర్త పట్టించుకోలేదని భార్య ఏం చేసిందో తెలుసా ?
తమ్ముడు సినిమాలో నటించిన ఈ కమెడియన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?