Advertisement
ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎక్కడో ఒక దగ్గర పెళ్లి చేసుకోవాల్సిందే. ప్రపంచ జనాభాలో 90 శాతం మంది పెళ్లి చేసుకుంటారు.. పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. అలాంటి పెళ్లిని చాలామంది గ్రాండ్ గా చేసుకుంటూ ఉంటారు. ఇందులో కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న, కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి, అమ్మాయిలో ఇలాంటి అలవాట్లు ఉంటే వారి పెళ్లి తర్వాత జీవితం అద్భుతంగా ఉంటుందని కొంతమంది నిపుణులు అంటున్నారు. మరి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వారిని పెళ్లి చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?
గౌరవం:
ముఖ్యంగా పెళ్లి చేసుకునే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తనకు కాబోయే జీవిత భాగస్వామి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. దీనివల్ల పెళ్లయిన తర్వాత ఇబ్బందులు పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఒకరి ఇష్ట ఇష్టాలను మరొకరు గమనించుకుంటే సంసారపు జీవితం సాఫీగా సాగుతుంది.
ఇతరులను నమ్మవద్దు:
Advertisement
1000 అబద్దాలు ఆడి పెళ్లి చేయాలనేది పూర్వకాలపు సామెత. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు అప్డేట్ అయ్యారు. పూర్వం అబ్బాయిలు పనిచేస్తే అమ్మాయిలు ఇంట్లో ఉండేవారు , కానీ ప్రస్తుతం అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా అమ్మాయిలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఎలాంటి అబద్ధాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మనసు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిది.
నియంత్రణ:
పెళ్లి చేసుకున్న తర్వాత జీవిత భాగస్వామి పట్ల ప్రతి చిన్న విషయానికి అరవకుండా నియంత్రణలో ఉండాలి.. అలా ఉంటేనే వారి యొక్క సంసార జీవితం హ్యాపీగా ముందుకెళ్తుందని, లేదంటే మధ్యలోనే సమసి పోతుందని కొంతమంది నిపుణులు అంటున్నారు.
also read: అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న 5 టాలీవుడ్ స్టార్స్..!!
పురుష అహంకారం పనికిరాదు:
పూర్వకాలంలో అయితే పురుషుల యొక్క ఆజమాయిషి ఎక్కువగా ఉండేది. స్త్రీలు కేవలం వంట గదికే పరిమితం అనే ఆప్షన్ ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటివేవీ కనిపించడం లేదు అమ్మాయిలు కూడా గగనతలంలో విమానాలు నడుపుతున్నారు. కొంతమంది మగవాళ్లు కూడా చేయలేని పనులు ఆడవారు చేస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో నేను పురుషుడిని నా కింద స్త్రీ లొంగి ఉండాలి అనే భావన పనికిరాదని, ఒకవేళ అలాంటి ఆలోచనతో క్రూరంగా ప్రవర్తించే భర్తలు ఎవరైనా ఉంటే మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.
also read:Telangana Summer Holidays: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్..వేసవి సెలవులు ఎప్పటినుంచంటే..?