Advertisement
హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది శివున్ని పూజిస్తారు. శివానుగ్రహం లేనిదే చీమ అయినా కుట్టదు అని చాలామంది నమ్ముతారు. అలాంటి శివుడు సర్వలోక రక్షకుడిగా ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. త్రినేత్రాలు కలిగిన శివుని నిష్టతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటుంటారు..
Advertisement
ముఖ్యంగా మనం శివుని అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా శివరాత్రి పర్వదినం రోజున ఈ నియమాలు పాటించాలని దీనివల్ల చాలా మంచి జరుగుతుందని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.. మరి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. శివ భక్తులకు మహాశివరాత్రి ఒక పర్వదినం. ఈరోజు భక్తులందరూ నిష్టగా ఉపవాసాలు చేస్తారు. శివుడికి తీరక్క పూలు, పండ్లు సమర్పించి ఉపవాస దీక్షకు పూనుకుంటారు. ఇక శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరిగే రోజని వీరిద్దరిని ఆదిదంపతులు అని కూడా అంటారు.
Advertisement
అలాంటి మహాశివరాత్రి పర్వదినం రోజున పెళ్లి కాని వారు శివపార్వతులను ఈ విధంగా కొలిస్తే మన పెళ్లికి ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయని, కోరుకున్న వ్యక్తితో త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. అయితే శివరాత్రి రోజున పెళ్లి కాని వారు శివపార్వతుల విగ్రహాలను సమీపాలయంలోకి తీసుకెళ్లి శివపార్వతుల చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణం చేయాలంట, అంతేకాకుండా ఎర్రని వస్త్రాలు ధరించి కోరికల నెరవేర్చమని శివుడిని మరియు పార్వతిని ప్రార్థించాలంట. ఈ విధంగా చేయడం వల్ల పెళ్లి కోసం ఎదురు చూసే వారికి తొందరగా పెళ్లి అవుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు.
also read: