Advertisement
రోజు మన చుట్టూ లక్షల్లో వాహనాలు రోడ్లపై చెక్కర్లు కొడుతుంటాయి. ఆ వాహనాల నెంబర్ ప్లేట్లపై వివిధ రకాలుగా నెంబర్లు దర్శనమిస్తాయి. ఈ నెంబర్ ప్లేట్లలో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి ఏ వాహనం ఏ రాష్ట్రానికి చెందినదో ఇట్లే తెలుసుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి UK, తెలంగాణకు TS, ఆంధ్రప్రదేశ్ కి AP, ఢిల్లీకి DL, హర్యానాకు HR లాంటి గుర్తులు కేటాయిస్తారు. కానీ ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం తరచుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి నివాసం ఉండే వారికి వాహనాల రిజిస్ట్రేషన్ ఒక తలనొప్పిగా మారింది. ఇలాంటివారు ముందు వాహనాలు రిజిస్టర్ అయిన రాష్ట్రం నుంచి ఒక ఎన్వోసీ పొందాలి.
Advertisement
Advertisement
ఆ తర్వాత మారిన రాష్ట్రంలో వాహనానికి రీ రీజిస్ట్రేషన్ చేయాలి. దీంతోపాటు ఆ రాష్ట్రానికి రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ భారత్ సిరీస్ (BH) పేరుతో రిజిస్ట్రేషన్ ను కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీని ప్రకారం మీరు మీ పాత కారుని కూడా BH నెంబర్ ప్లేట్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు కొత్త వాహనాలకు మాత్రమే BH సిరీస్ నెంబర్ ప్లేట్లను ఎంచుకునే వీలుంది. కానీ తాజాగా ఈ BH నెంబర్ ప్లేట్ ని ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. సాధారణ వీలర్ రిజిస్ట్రేషన్ నెంబర్లను భారత్ సిరీస్ నెంబర్లుగా మార్చడానికి అనుమతి ఇచ్చింది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ.
కానీ ఇందుకు అవసరమైన పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఈ సందర్భంగా పౌరుల సౌకర్యార్థం మంత్రిత్వ శాఖ రూల్ 48 లో సవరణను ప్రతిపాదించడం గమనార్హం. ఇది నివాసం లేదా కార్యాలయంలో BH సిరీస్ కోసం దరఖాస్తులను సులభతరం చేస్తుంది. అయితే ఇక్కడ డ్రైవర్ కూడా తన రోడ్డుపన్ను చెల్లించాలి. ఇప్పటివరకు కొత్త వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు పరిమితమయ్యాయి. ఈ తాజా నిర్ణయంతో మీరు కూడా పాత కార్లకు BH సిరీస్ నెంబర్ ప్లేట్లను పొందవచ్చు.
Read also: బిందెతో ఫోజులిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?