Advertisement
ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులంతా మునిగిపోయారు. పెద్ద పెద్ద గణేష్ ప్రతిమలు ప్రతిష్టించి నిత్య పూజలతో గణేష్ మండపాలు అన్ని కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ గణేష్ ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ విధంగా పది రోజులు గణేశ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగుతాయి. తర్వాత 11వ రోజు నిమజ్జనం చేస్తారు. మరి అలా నిమజ్జనం ఎందుకు చేస్తారు? దానికి కారణం ఏంటో ?మనం ఇప్పుడు చూద్దాం.. గణేష్ ఉత్సవాలను భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్ధి తిథి నాడు ప్రారంభిస్తారు. అలా 10 రోజుల తర్వాత చతుర్దశినాడు గణేష్ నిమజ్జనం చేసేస్తారు.
Advertisement
also read:
10 రోజుల తర్వాత అనంత చతుర్దశి నాడు ప్రవహిస్తున్నటువంటి నది లేదా చెరువు,కాలువ సమీపంలో గణేష్ నిమజ్జనం చేసేస్తారు అని చాలామందికి తెలుసు.. కానీ దీని వెనుక అసలు కారణం తెలియదు.. ఆ కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..గణపతి చతుర్దశి రోజున ప్రతిమను ప్రదర్శించే సమయంలో వివిధ రకాల పూజాకార్యక్రమాలు ఆరాధన చేస్తారు. అప్పటి నుంచి గణపతి దేవుడికి భక్తులు వారి వారి కోరికలు తీర్చమని చెవుల్లో చెబుతారు. ఆ తర్వాత విగ్రహాన్ని చతుర్దశి రోజున నదిలో లేదా చెరువు నీటిలో నిమజ్జనం చేస్తారు.
Advertisement
ఈ విధంగా గణపతిదేవుడు భూలోకం నుండి విముక్తుడై దేవలోకానికి చేరుతాడు. ఆ తర్వాత భూలోకంలో భక్తులు చెప్పిన కోరికలన్నీ విని దేవతలకు చెప్పి నెరవేరుస్తారని నమ్మకం. ఇదే కాకుండా వేదవ్యాసుడు మహాభారతం స్టోరీని గణేష్ చతుర్దశి నుంచి అనంత చతుర్దశి వరకు పది రోజుల పాటు చెబుతారు. ఇలా కథ విన్నన్ని రోజులు గణేశుడు కళ్ళు తెర్చుకొని ఉండటంతో ఆ కథ ప్రభావం గణేషుని పై పడి అతనికి జ్వరం వచ్చేసి బాడీ అంత హిట్ అవుతుంది. దీంతో గణేషుడిని సమీపంలోని చెరువు కు తీసుకెళ్లి ముంచుతారు. దీంతో వినాయకుడికి వేడి తగ్గిపోతుందని కొందరి భక్తుల నమ్మకం.
also read: