Advertisement
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఒక యువతి అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలని కోల్పోయింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జట్టి హారిక న్యూట్రిషన్ ఫుడ్ అండ్ సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లారు. అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. భారత టైమింగ్స్ ప్రకారం ఆదివారం ఉదయం ఆమె తన విధులు కంప్లీట్ అయ్యాక తోటి వారితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు.
Advertisement
మొత్తం ఐదుగురు వెళ్తుండగా హారిక వెనుక సీట్ల కూర్చున్నారు. వీళ్ళు కారులో వెళుతున్న మార్గంలో బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడడంతో వెంటనే సడన్ బ్రేక్ వేసి కారుని నిలిపివేశారు. ఒకదాని వెంట మరొకటి మొత్తం మూడు వాహనాలు హారిక ప్రయాణిస్తున్న కారుని ఢీకొన్నాయి. ఆక్సిడెంట్ లో హారిక స్పాట్లో చనిపోయారు మిగిలిన వాళ్ళకి గాయాలయ్యాయి. హరిక అందరి జట్టు శ్రీనివాసరావు దేవదాయ శాఖలో సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగాలు పనిచేస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
కూతురు మృతదేహం స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాలని వేడుకున్నారు. పేద కుటుంబానికి చెందిన తమ బ్యాంకు లోన్లు తీసుకుని మరీ ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ తో పాటుగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని కూతురు మృతదేహం స్వగ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!