Advertisement
కరోనా మహమ్మారి మరోసారి భారత్ లో తన ప్రతాపం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్లో పాజిటివిటీ రేటు పెరుగుతోంది. రెండు రోజుల్లో భారత్ కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 39 మందికి కరోనా సోకినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. సంబంధిత వర్గాలను అప్రమత్తం చేసింది.
Advertisement
విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్ పోర్టుల్లోనే టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆదిలోనే వైరస్ ను కట్టడి చేయాలని పకడ్బందీ చర్చలు చేపట్టారు. ఈ క్రమంలో పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కు పంపుతున్నారు. ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ర్యాండమ్ గా సుమారు 6వేల మందికి పరీక్షలు నిర్వహించారు. విమానాశ్రయాలకు వచ్చి వెళ్లే ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Advertisement
ఇక కరోనా కేసుల విషయంలో జనవరి నెల జాగ్రత్తగా ఉండాలని అంటోంది కేంద్రం. జనవరి రెండో వారానికి దేశంలో కరోనా కేసులు పెరగవచ్చునని, గత ట్రెండ్ ని బట్టి ఈ అంచనాకు వచ్చామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తూర్పు ఆసియా నుంచి కోవిడ్ వైరస్ 10 రోజుల్లో యూరప్ లో వ్యాపించిందని, మరో 10 రోజులకు అమెరికాకు చేరిందని, తూర్పు ఆసియాలో అడుగు పెట్టిన తరువాత 30 నుంచి 35 రోజుల్లో ఇండియాలో ప్రవేశించిందని వివరించింది.
అయితే.. ప్రస్తుతం మాస్కు మస్ట్ అనేది లేదు. కేంద్రం సైడ్ నుంచి ఒత్తిడి ఏమీ లేదు. రాష్ట్రాలకే వదిలేసింది. కర్ణాటక వంటి రాష్ట్రాలు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా సినిమా హాళ్లు, పార్కులు, మార్కెట్లు వంటివాటి చోట తప్పనిసరి చేస్తూ నిబంధనను అమలులోకి తెచ్చాయి. ఇటు గత 24 గంటల్లో కొత్తగా 188 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది.