Advertisement
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆట ముగిసింది. సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయంతో ఇంటి దారి పట్టింది. ఈసారి ఫైనల్ కు చేరుతుంది. పాకిస్తాన్ చిత్తు చేసి టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోగా.. అందర్నీ నిరాసపరిచింది రోహిత్ సేన. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
Advertisement
రోహిత్ (27) ఫర్వాలేదనిపించినా ధాటిగా ఆడలేకపోయాడు. కేఎల్ రాహుల్ (5), రిషభ్ పంత్ (6), సూర్యకుమార్ (14) పెద్దగా రాణించలేదు. హార్దిక్ పాండ్యా(63) దూకుడుగా ఆడాడు. విరాట్ కోహ్లీ (50) మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో కీలక పాత్ర పోషించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది టీమిండియా.
Advertisement
లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. 169 పరుగుల లక్ష్యాన్ని అలవోకంగా ఛేదించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అలెక్స్ హేల్స్(86 నాటౌట్), జోస్ బట్లర్ (80 నాటౌట్) సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయారు. టీమిండియా బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇంకా నాలుగు ఓవర్లు మిగలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేశారు.
ఈ మ్యాచ్ లో కాస్త సంతోషకరమైన విషయం ఏంటంటే.. విరాట్ కోహ్లి మరో రికార్డ్ ను నెలకొల్పాడు. ఇటీవల అక్టోబర్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్న ఈ రన్ మెషీన్.. తాజాగా టీ-20ల్లో 4008 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా నిలిచి రికార్డు సృష్టించాడు. ఇంగ్లాడ్ తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో విరాట్ ఈ ఘనత సాధించాడు.