Advertisement
మనదేశంలో క్రికెట్ కు మంచి ఆదరణ ఉంటుంది. క్రికెట్ మనదేశంలో పుట్టకపోయినా, క్రికెట్ కు కోట్ల సంఖ్యలు అభిమానులు ఉన్నారు. అలాగే మన దేశంలో క్రికెట్ ఆడేవారు చాలామంది ఉన్నారు. భారత జట్టులో చోటు కోసం చాలామంది ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. కాంపిటేషన్ ఎక్కువగానే ఉంది. అయితే భారత జట్టులో ఆడిన చాలామంది ఆటగాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలను చేసిన వారు ఉన్నారు. వారెవరు ఇప్పుడు చూద్దాం.
Advertisement
# ధోని
అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో అడుగు పెట్టక ముందు ధోని, ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ క్రికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేశాడు. 2011లో 28 ఏళ్ల తర్వాత ధోని కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. అదే ఇయర్ లో లెఫ్టినెంట్ కల్నేల్ గా ధోనిని నియమించారు.
# సచిన్
సచిన్ టెండూల్కర్, తన కెరీర్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అలాగే ఎన్నో బిరుదులు అందుకున్నాడు. అయితే, 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్సులో గ్రూప్ కెప్టెన్ గా సచిన్ నియామకమయ్యారు.
# చాహాల్
లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ లీడింగ్ స్పిన్నర్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు చాహాల్. 2016లో టీమిండియా తరపున ఆడడానికి ఎంపికయ్యాడు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాహల్ కు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ పోస్టును ఆఫర్ చేశారు.
Advertisement
# కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ అయ్యారు. ఫైనాన్షియల్ లీటరసి ఇంకా ఇండియాలో ఫైనాన్షియల్ లీటరసి ఇంపార్టెన్స్ గురించి, ఆర్బిఐ రూపొందించిన అడ్వర్టైజ్మెంట్ లో కూడా కనిపించారు.
# జోగిందర్ శర్మ
జోగిందర్ శర్మ, 2007 టీ 20 వరల్డ్ కప్ లో చివరి ఓవర్ వేసిన సంగతి తెలిసిందే. జోగేంద్ర శర్మ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ లో అపాయింట్ చేయబడ్డారు. ఇతను ప్రస్తుతం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా వర్క్ చేశాడు.
#హర్భజన్ సింగ్ – పంజాబ్
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా హర్భజన్ సింగ్ పనిచేశారు.
#కపిల్ దేవ్
ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా కపిల్ దేవ్ గా పనిచేశారు.
READ ALSO : సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం..నెలకు లక్ష రూపాయలు జీతం !