Advertisement
ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత యువ ఆటగాళ్లు చక్కటి ఆటతో దూసుకు వెళ్తున్నారు. ఫీల్డింగ్ తో కూడా భారత ప్లేయర్లు ఆకట్టుకుంటున్నారు. తాజాగా అద్భుతమైన సీను ఒకటి ఈ ముఖ్యమైన మ్యాచ్లో చోటు చేసుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ లోనే కాకుండా భారతీయ ఆటగాళ్లు ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటుకున్నారు. ఏదో స్ప్రింగ్స్ ఉన్నట్టే హర్షిత్ రానా జంప్ చేసి క్యాచ్ పట్టాడు వివరాల్లోకి వెళితే.. కొలంబోలో జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్లో ఇండియా ప్లేయర్లు పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ కి చుక్కలు చూపించారు.
Advertisement
పాక్ ఇండియా స్కోర్ ని దాటాలని బ్యాటింగ్ చేస్తుంటే హంగర్‌గేకర్, హర్షిత్ రాణా కలిసి పాక్ ఇన్నింగ్స్‌ను అడ్డుకున్నారు. కాసిమ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 46వ ఓవర్‌లో హంగర్‌గేకర్ వేసిన నాలుగో బంతిని కట్ చేసేందుకు ట్రై చేస్తూ కాసిమ్ స్లిప్‌లో ఔటయ్యాడు. హంగర్‌గేకర్ కి వికెట్ దక్కింది. హర్షిత్ రాణా గాలిలో ఎగిరి, వేగంగా కుడి చేతిని పైకి ఊపుతూ క్యాచ్ పట్టాడు. నిజానికి ఇది సూపర్ క్యాచ్. హంగర్‌గేకర్ కి ఇది మూడవ వికెట్. ఆ తర్వాత చివరి రెండు వికెట్లను కూడా తీసి. మొత్తం ఐదు మందిని ఔట్ చేసాడు.
Advertisement
Please check Harshit Rana's shoes for springs!#INDvPAKonFanCode #INDvPAK pic.twitter.com/wfK3A16Qwq
— FanCode (@FanCode) July 19, 2023
Also read: