• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » ఇంజనీరింగ్ చదువుదామని అనుకుంటున్నారా? అయితే ఆటానమస్ విద్యా సంస్థల్లో చదివితే వచ్చే లాభాలేంటి?

ఇంజనీరింగ్ చదువుదామని అనుకుంటున్నారా? అయితే ఆటానమస్ విద్యా సంస్థల్లో చదివితే వచ్చే లాభాలేంటి?

Published on August 28, 2022 by Bunty Saikiran

Advertisement

దేశంలో ప్రస్తుతం విద్యార్థులకు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సాధారణంగా దేశంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఏదో ఒక యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తాయి. కానీ ఆటానమస్ కాలేజీలు మాత్రం స్వతంత్రంగా పనిచేస్తాయి. అందుకనే వాటికి ప్రాముఖ్యత పెరుగుతోంది. కాలేజీల్లో అందుబాటులో ఉండే బోధన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పాలనా సౌకర్యం తదితర అనేక అంశాల ఆధారంగా కాలేజీలకు ఆటానమస్ స్టేటస్ ను ఇస్తారు. అయితే విద్యార్థులకు ఈ కాలేజీల్లో చదవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలా త్వరగా లభించడమే కాదు, కెరీర్ పరంగా కూడా ఎంతో లాభం ఉంటుంది.

సాధారణంగా యూనివర్సిటీలకు అనుబంధంగా పనిచేసే కాలేజీలు యూనివర్సిటీ మీద ఆధార పడాల్సి ఉంటుంది. యూనివర్సిటీలు ఇచ్చే తేదీల ప్రకారం క్లాసులు, పరీక్షలు నిర్వహించాలి. కానీ ఆటానమస్ కాలేజీలు అలా కాదు. సొంతంగా సిలబస్ ను, అకాడమిక్ క్యాలెండర్ ను రూపొందించుకోవచ్చు. తమకు అనుగుణంగా సెమిస్టర్ లను నిర్వహించవచ్చు. అలాగే ఇతర కాలేజీల కన్నా వేగంగా పరీక్షలను నిర్వహించవచ్చు. దీనివల్ల విద్యార్థులకు దీర్ఘకాలం పాటు పరీక్షలు ఫలితాల కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఇక ఆటానమస్ కాలేజీలు స్వతంత్రంగా పనిచేస్తాయి. కాబట్టి పారిశ్రామిక, కార్పోరేట్ అవసరాలకు అనుగుణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను బట్టి విద్యార్థుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోర్సులను అందించవచ్చు. దీనివల్ల విద్యార్థులు ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్ ను బట్టి ముందుకు సాగవచ్చు. కాలేజీలో విద్య ముగించుకున్న వెంటనే జాబ్ లభించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పరిశ్రమలు, కంపెనీల డిమాండ్ మేరకు ఆటానమస్ కాలేజీలు నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేయవచ్చు. దీంతో కంపెనీలకు తమకు కావాల్సిన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు వెంటనే లభిస్తారు. మరోవైపు విద్యార్థులకు కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వెంటనే ఉద్యోగం పొందవచ్చు.

ఆటానమస్ కాలేజీల్లో ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా విద్యాబోధన చేస్తారు. అందుకు అనుకూలంగా సిలబస్ ను రూపొందిస్తారు. అకాడమిక్ ప్రోగ్రామ్స్ ను అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు నిర్వహిస్తారు. అధునాతన బోధనా పద్ధతుల్లో విద్యను అభ్యసించవచ్చు. ఆటానమస్ కాలేజీలు ఎక్కువగా ప్రాజెక్టులు, యాక్టివిటీలను ఇంటర్న్ షిప్ లను నిర్వహిస్తారు. దీనివల్ల విద్యార్థులకు కెరీర్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. ఇది వారి ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. కెరీర్ లో తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఇక ఆటానమస్ కాలేజీలు అక్రిడిటేషన్ ను కలిగి ఉండి అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్య బోధన అందిస్తాయి. కనుక ఆ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇతర యూనివర్సిటీలు ప్రాధాన్యతను ఇస్తాయి. అలాగే కంపెనీలు కూడా వారికి మొదటి ప్రాధాన్యతను ఇస్తాయి.

Advertisement

ఆటానమస్ కాలేజీల్లో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొని ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ను ఫాలో కావచ్చు. తమ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవచ్చు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కంపెనీల అవసరాల మేరకు ఆటానమస్ కాలేజీలు ఎప్పటికప్పుడు సిలబస్ లకు అకాడమీ కోర్సులకు మార్పులు చేర్పులు చేస్తుంటారు. దీని వల్ల ఆ విద్యార్థులు చదువు ముగియగానే వెంటనే జాబు పొందేందుకు అవకాశం ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తే వెంటనే జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆటానమస్ కాలేజీల్లో ప్రముఖ ప్రొఫెసర్లచే కోర్సులను ఏర్పాటు చేస్తారు. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. వీటిని విద్యార్థులు ఎప్పటికప్పుడు పూర్తి చేసి తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకోవచ్చు.

ఆటానమస్ కాలేజీల్లో అందించే ఫుల్ టైమ్ ఇంటర్న్ షిప్ లు విద్యార్థులకు మేలు చేస్తాయి. కార్పొరేట్ కంపెనీలతో వారికి టై అప్స్ ఉంటాయి. కనుక విద్యార్థులు ఇతర కాలేజీల విద్యార్థుల కన్నా ముందుగానే ఇంటర్న్ షిప్ లు చేసి జాబ్ లకు సిద్ధం కావచ్చు. ఇతర కాలేజీల్లో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం ఆలస్యం అవుతుంది. కానీ అటానమస్ కాలేజీలలో ఈ ప్రక్రియలు చాలా వేగంగా జరుగుతాయి. దీనివల్ల విద్యార్థులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. అలాగే పాఠ్యాంశాల్లో వెనుకబడే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ సెమిస్టర్లు నిర్వహిస్తారు. దీనివల్ల చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు మేలు కలుగుతుంది.

ఆటానమస్ కాలేజీల్లో ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ ఉంటుంది. అంటే ఆటానమస్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఏదైనా అంతర్జాతీయ కాలేజీ లేదా యూనివర్సిటీకి మారితే ఇక్కడ కాలేజీలో ఆ విద్యార్థికి ఉండే క్రెడిట్ ను అక్కడి కాలేజీ లేదా యూనివర్సిటీకి సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక ఏదైనా కాలేజీకి అటానమస్ స్టేటస్ ఇచ్చే అధికారం యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ (యుజిసి) కి ఉంటుంది. ఒక కాలేజీ 10 ఏళ్ల నుంచి సేవలు అందిస్తుండాలి. దానికి నాక్ (ఎన్ఏఏసి) అక్రిడిటేషన్ కనీసం ఏ గ్రేడ్ ఉండాలి. లేదా ఎన్ బిఏ అక్రిడిటేషన్ స్కోరు కనీసం 675 ఆపైన ఉండాలి. కనీసం 3 అకాడమిక్ ప్రోగ్రాం లలో ఆ స్కోరు ఉండాలి. దీంతో ఆ కాలేజీకి ఆటానమస్ స్టేటస్ ఇస్తారు.

Advertisement

Also Read: మీ పాదాల వేళ్ల బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు…ఎలానో తెలుసా !

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd