Advertisement
యువత రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్ బాగుంటుంది అన్న మాటలను మనం వింటూనే ఉంటాం.. కానీ నిజంగా రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆ పరిస్థితి కనిపించదు. కానీ ఈ ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. చాలా మంది యువతీ యువకులు ఎన్నికల్లో పోటీ చేసారు. కొందరు గెలుపొందారు కూడా. వారిలో 26 ఏళ్ల యశస్వినీ రెడ్డి కూడా ఉన్నారు. పాలకుర్తిలో ఓటమి ఎరుగని ఎర్రబెల్లి దయాకర్ రావు కు పోటీగా నిలబడిన యశస్వినీ రెడ్డి విజయం సాధించారు.
Advertisement
1985 నుంచి ఇప్పటి వరకూ.. అంటే దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు ఓటమి ఎరుగని రాజకీయ జీవితాన్ని చవి చూసిన ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఓ 26 ఏళ్ల అమ్మాయి విజయం సాధించింది. అసలు ఈ సీటు యశస్వినీ రెడ్డికి కాకుండా.. ఆమె అత్తగారు ఝాన్సీ రెడ్డికి రావాల్సి ఉంది. కానీ ఆమె ఎన్నారై అవడంతో ఇబ్బంది అయ్యింది. అప్పటికీ.. ఆమె భారత పౌరసత్వం కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ.. అది పెండింగ్ లో ఉంది.
Advertisement
అందుకే ఆమెకు బదులుగా యశస్వినీ రెడ్డిని ఝాన్సీ రెడ్డి నిలబెట్టారు. ఆమె వయసు 26 సంవత్సరాలు మాత్రమే. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పాలకుర్తి సహా ఇతర తెలంగాణా ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు చేసిన మరింత సేవలు అందించడం కోసం ఎమ్మెల్యే అవ్వాలి అన్న లక్ష్యంతో కాంగ్రెస్ లో చేరారు. అయితే.. భారత పౌరసత్వం లేకపోవడం అనేది ఆమెకు అడ్డంకి అవ్వడంతో ఆమె బదులు యశస్వినీ పోటీ చేసి విజయం సాధించారు. 2018లో బీటెక్ చదివిన యశస్వినీ రెడ్డి వివాహం అయ్యాక అమెరికా వెళ్లిపోయారు. ఎటువంటి అనుభవం లేకున్నా.. ఆమె పాలకుర్తి లో పోటీ చేసి గెలిచారు.
Read More:
సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ కి నళిని ఎలా స్పందించిందంటే..?
Telugu Paper Cartoon News: Today Cartoon in Telugu Papers 17 December 2023, తెలుగు న్యూస్ కార్టూన్స్
ఆ సమయంలో భర్త మరో మహిళతో ఉన్నా తప్పులేదు.. హై కోర్ట్ సంచలన తీర్పు!